10 కోట్ల ఆంత్రజీవులు!


Tue,August 6, 2019 12:25 AM

ఒక్క ఆపిల్ పండులోనే 10 కోట్ల సూక్ష్మజీవులను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇవి మనకు మేలు చేసేవేనని, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో వీటి పాత్ర ఎంతో కీలకమని వారంటున్నారు.
Apple
సాధారణంగా పచ్చిపండ్లు, కూరగాయల్లో జీర్ణశక్తిని పెంపొందింపజేసే ఆంత్రక్రిములు అత్యధికంగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి, సేంద్రియ (సంప్రదాయ) పద్ధతిలో పండిన పండ్లలో అయితే ఇవి మరింత మెండుగా లభ్యమవుతాయి. ఆస్ట్రియాలోని స్టిరియా (Styria, Austria) రాష్ర్టానికి చెందిన గ్రాజ్ (Graz) యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఒక్క సేపు (ఆపిల్) పండులోనే సుమారు 10 కోట్ల (100 మిలియన్) సూక్ష్మజీవులు ఉన్నట్టు తేలింది. సాధారణ సంప్రదాయ దుకాణం నుండి తెచ్చిన పండులోనే ఈ పరిస్థితి వెల్లడైంది. ఇక, తాజా సేంద్రియ పచ్చి ఆపిల్‌లో అయితే మరింత ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయని వారంటున్నారు. ఫ్రంటీర్స్ ఇన్ మైక్రోబయాలజీ (Frontiers in Microbiology) జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో 240 గ్రాముల బరువు తూగే ఆపిల్ పండులోనే అంతటి సంఖ్యలో మనకు మేలు చేసే ఆంత్రజీవులు ఉన్నట్టు వారు గుర్తించారు. దీని పొట్టుకన్నా గుజ్జు, గింజలలోనే అవి ఎక్కువ ఉన్నట్టు వారు చెబుతున్నారు.

285
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles