ద్రవ బంగారం!


Tue,August 6, 2019 12:25 AM

తల్లి పాలను ద్రవ బంగారం (liquid gold) గా పిలుస్తున్నారంటేనే వాటి విలువ ఎంతో తెలుస్తుంది. రేపటితో ప్రపంచ మాతృపాల వారోత్సవం ముగుస్తున్న వేళ అమ్మపాలలోని గొప్పదనమిది.
mother
చంటిబిడ్డలకు అమ్మపాలు అమృతం వంటివే. వీటిని మించిన పోషక పదార్థాలు మరేవీ ఉండవు. అందుకే, తల్లులు ప్రసవం తర్వాత అందచందాల పరిరక్షణ పేరుతో తాము నవమాసాలు మోసి, అష్టకష్టాలూ పడి కన్న బిడ్డకు పాలు పట్టడానికి మొహమాట పడకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. అభం శుభం తెలియని పసిపిల్లలకు కావలసిన అన్ని పోషకాలనూ తల్లిపాలు పుష్కలంగా ఇస్తాయని వారంటున్నారు. తల్లి పాలు తాగే పిల్లలకు ఎలాంటి మలబద్ధకం సమస్యలు రాకపోగా, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వంటివేవీ సాధారణంగా దరిచేరవనీ వారంటారు. తల్లిపాలు తాగి, పెరిగే పిల్లల్లో ప్రజ్ఞ (ఐక్యూ- intelligence quotient) కు తిరుగుండదని కూడా శాస్త్రవేత్తలు అంటారు. పుట్టిన వెంటనే వైద్యులు సూచించే వరకు రోజుకు 8 నుంచి 12 పర్యాయాలు బిడ్డకు తల్లి పాలివ్వాలని వారు సూచిస్తున్నారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్‌ఫీడింగ్ వీక్‌ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. తొలి రోజుల్లో తల్లులనుండి బిడ్డకు సుసంపన్నమైన పోషకాలతో కూడిన పాలు (Colostrum) లభిస్తాయని, వీటి రంగు పసుపుపచ్చగా ఉండడం వల్ల ద్రవ బంగారంగానూ వీటిని వ్యవహరిస్తారని వారు అంటున్నారు.

432
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles