మధుమేహం ఇక బాధించదు!


Mon,August 5, 2019 11:00 PM

సరైన అవగాహన లేక.. ఆరోగ్యవంతమైన జీవనశైలి లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల ప్రజలు ఈ మధుమేహం బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో పేర్కొన్నది. గింజలు తినడం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో పెట్టొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడికాయ గింజలు:

Pumpkin-Seeds
వీటికి రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైబర్ కూడా ఉంటుంది. వీటివల్ల టైప్-2 డయాబెటీస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

అవిసె గింజలు:

Flaxseeds
వీటిని పొడిగా చేసుకొని ఓట్‌మీల్, తృణధాన్యాలు, పెరుగులో కలుపుకొని తింటే మధుమేహ ప్రభావం తగ్గుతుంది.

చియా గింజలు:

Chia-Seeds
వీటిని అవిసె గింజల వలె గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. అల్పాహారం, తృణధాన్యాలు, గంజి, కూరగాయలు, పెరుగులో నేరుగా కలుపుకొని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

మెంతి గింజలు:

Fenugreek
వీటిని రాత్రిపూట ఒక కప్పు నీటిలో నానబెట్టి ఉంచాలి. పొద్దున ఆ నీటిని తాగాలి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. డయాబెటీస్ బెడద ఉండదు.

స్వచ్ఛమైన గింజలు:

Seeds
చక్కెర రహిత పదార్థాల ద్వారా ఉపశమనం పొందాలనుకునేవాళ్లు వాటిని కాకుండా స్వచ్ఛమైన గింజలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రకరకాల డైట్ల వల్ల సమస్యలే తప్ప లాభం ఉండదు.

86
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles