రివర్స్ వాటర్ ఫాల్స్


Fri,August 9, 2019 12:36 AM

maxresdefault
సాధారణంగా జలపాతాల నీరు పెద్ద పెద్ద కొండల మీద నుంచి కిందకు జల జలా ఉవ్వెత్తున ఎగిసి పడుతూ జారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు కొండల మీద నుంచి నీరు పైకి పోతూ ఉంటుంది. నీరు ఎప్పుడూ పల్లానికే కదా ప్రవహించాల్సింది అంటే.. నిజంగానే నీరు కిందకే వెళ్లాలి. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ ప్రవహిస్తుంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజంగా నిజం. ఇంతకి ఇది ఎక్కడో వేరే దేశంలో కాదు. మన దేశంలో అదీ మన పక్కననున్న మహారాష్ట్రలోని పునెలో. ఇక్కడి సమీపంలోని నానేఘాట్ వద్ద ఉన్నఈ జలపాతం చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ భూమికి గురుత్వాకర్షణ శక్తి లేదు. అందుకే జలపాతంలో ప్రవహిస్తున్న నీరు పైకి పోతుందని కొందరు అంటుంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజంలేదు. ఇదంతా గాలి కారణంగానే జరుగుతుంది. పర్వతంపైన మేఘాలు కిందకు దిగుతున్నప్పుడు గాలులు బలంగా వీస్తాయి. దానివల్ల కిందకు ప్రవహించే నీరు రివర్స్‌లో ప్రవహిస్తుంది. అప్పుడు చూడటానికి జలపాతం పైకి పోతున్నట్లు కనిపిస్తుంది. ఇలా నీరు పైకి ప్రవహిస్తూ ఉంటే.. చూడటానికి భలేగా ఉంటుంది. ఈ వింతను చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వ వస్తుంటారు. మనకు దగ్గరల్లోనే ఉందిగా వీలైతే మీరూ ఒక్కసారి వెళ్లిరండి మరి!
Reverse-Waterfalls

510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles