ప్రాయశ్చిత్త జపానికి వేళ ఇదే!


Fri,August 9, 2019 12:54 AM

Ila-cheddam
వేదపండితులు, సంధ్యావందనోపాసకులు ఏడాదిపాటు గాయత్రీ మంత్రజపాలలో తెలిసీ తెలియక చేసే దోషాలకు సనాతన శాస్ర్తాలు ప్రాయశ్చిత్తాన్ని చూపించాయి. శ్రావణ పూర్ణిమనాడు లేదా ఆ మర్నాడు (పాడ్యమి) సహస్ర గాయత్రి జపం దీనికి అద్భుత నివారణగా ఆపస్తంభ ధర్మసూత్రం వెల్లడించినట్టు ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్ (తెలంగాణ) గాయత్రి ఉపాసన సంస్థ వచ్చే శుక్రవారం (16వ తేదీన) సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీవిద్యా సరస్వతీ శనైశ్వర దేవాలయ ప్రాంగణంలో సామూహిక సహస్ర గాయత్రీ జపం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆ రోజు ఉదయం గం॥ 7.30 ని॥ల నుంచి 11.30 వరకు ఎందరో వేదపండితులు ఈ జపంలో పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. అయితే, ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కావడంతో మిగిలిన వర్గాలకు చెందిన యజ్ఞోపవీతధారులెవరైనా సహస్ర గాయత్రీ జపాన్ని వ్యక్తిగతంగా ఇండ్లలోకాని, దేవాలయాలలోకానీ లేదా మరే అనుకూల ప్రదేశంలోనైనా ఆచరించుకోవచ్చు. ఏడాది కొకసారి వచ్చే ఈ ఆరుదైన అవకాశాన్ని గాయత్రి మాత భక్తులంతా సద్వినియోగపరచుకోగలిగితే ఆ అమ్మవారు ప్రసన్నానికి పాత్రులవవచ్చు.

866
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles