ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ చేయూత


Sat,August 10, 2019 01:04 AM

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో బాగా పనిచేస్తున్న సంస్థలను ఆర్‌బీఐ తగిన విధంగా ప్రోత్సహిస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకు రుణాల మంజూరులో చేయూతనిచ్చే నిర్ణయాలను తీసుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా రుణదాత మూలధనంలో 20 శాతంగా ఉన్న రుణగ్రహీత స్పందన పరిమితిని 15 శాతానికి తగ్గించింది. ఎన్‌బీఎఫ్‌సీల ప్రయోజనాల కోసం బ్యాంకు రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా గుర్తిస్తుంది. ఈ విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీలు వ్యవసాయ పెట్టుబడి కోసం రూ. 10 లక్షల వరకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 20 లక్షల వరకు, గృహ రుణగ్రహీతలకు రూ. 20 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం కల్పించింది.

కానీ ఎన్‌బీఎఫ్‌సీల నుంచి గృహ రుణాల కోసం రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చేందుకు వీలుంది. ప్రాధాన్యత రంగాల అడ్వాన్స్‌ల కోసం గృహ రుణాల ఆన్-లెండింగ్ క్యాప్‌ను రూ. 10 లక్షల లోను టికెట్ నుంచి రూ. 20 లక్షల టికెట్‌కు పెంచింది. దీని ద్వారా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఎక్కువ రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులను ప్రోత్సహిస్తుంది. ఇది సరసమైన హౌసింగ్ విధానంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎచ్‌ఎఫ్‌సీ)ల రుణాలను మరింత పెంచుతుంది. ప్రాధాన్యత రంగ రుణాల కోసం ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులను అనుమతించడం వలన ఈ ప్రక్రియ మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుంది. ఇది ప్రస్తుత వాతావరణంలో ఎంఎస్‌ఎంఈ పనితీరును గణనీయంగా మెరుగుపర్చడంతోపాటు ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.

227
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles