చిన్న ఐడియా నగరాన్నే మార్చేసింది!


Sat,August 10, 2019 01:05 AM

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే విషయం తెలిసిందే. ఇజ్రాయేల్ దేశానికి చెందిన మున్సిపల్ అధికారులు అవలంభిస్తున్న చిన్న చిన్న విధానాలు చక్కటి ఫలితాల్ని అందజేస్తున్నాయి. పైగా, వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదని గుర్తుంచుకోండి.
parking

రాంగ్ రూటులో వెళ్లకుండా...

రాంగ్ రూటులో వాహనాలు రాకుండా నియంత్రించడానికి టెల్ అవీవ్‌లోని మున్సిపల్ అధికారులు వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఇది అత్యంత సులభమైనది, చవకైనది. పైగా ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు ఉండక్కర్లేదు. ఫొటోలో చూపించిన విధంగా ఒకవైపు పైకి కొనలు తేలినట్లుగా రోడ్డు మీద అమర్చారు. వాహనాలు సరైన రూటులో వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కాకపోతే, రాంగ్‌రూటులో రాకుండా చేయడానికి దాదాపు ప్రతి పార్కింగ్ ప్రదేశాల్లో ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. షాపింగ్ మాళ్లలో ఏసీలు ఉండటం సహజమే. చిన్న చిన్న దుకాణాల్లోనూ ఏసీలను బిగించడం సర్వసాధారణంగా మారింది. టెల్ అవీవ్‌లో గృహయజమానులు ఏసీ నుంచి వచ్చే నీటిని కూడా వృథా కానివ్వడం లేదు.

wrong-entry
ఆవిధంగా ఏసీ నుంచి వచ్చే నీటిని ఒక పైపు ద్వారా చెట్లకు మళ్లిస్తున్నారు. ఇక షాపింగ్ మాళ్లలో అయితే, ఏసీలన్నింటినీ ఒక పైపునకు బిగిస్తారు. ఆ ఏసీల నుంచి వచ్చే నీటిని అక్కడి చెట్లకు మళ్లిస్తున్నారు. ఇలా నీటిని సంపూర్ణంగా సంరక్షించడానికి పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నారు.చిన్న చిన్న వీధుల్లో ఎవరు పడితే వారు కార్లను పార్కింగ్ చేయడాన్ని మనం చూస్తుంటాం. వీరిని నియంత్రించడానికి టెల్ అవీవ్‌లో కొందరు గృహయజమానులు చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు. వారి వీధిలోకి అపరిచితుల కార్లు రాకుండా నిరోధించడానికి వీధి ఆరంభంలోనే, ఫొటోలో చూపించిన విధంగా ఒక పరికరాన్ని బిగించారు. దాంతో అపరిచితులెవ్వరూ ఆయా వీధుల్లోకి వెళ్లి వాహనాలు పార్కింగ్ చేసే అవకాశమే ఉండదు.
water

995
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles