అందమైన హంటర్!


Sun,August 11, 2019 01:42 AM

Hunting-Beauty
అందమైన హంటర్‌కు వలతో పనిలేదు. చేతులనే ఆయుధంగా చేసుకొని ఎంత పెద్ద చేపలనైనా ఇట్టే పట్టేస్తుంది. అంతేనా.. వాటి ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నది 23 యేండ్ల హన్నా బాన్.్ర పెద్ద పెద్ద చేపల్ని సైతం అమాంతం పట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. నదులు, చెరువుల్లో దిగి చేపల్ని ఉత్తి చేతులతోనే పట్టుకోగలగడం హన్నా ప్రత్యేకత. నూడ్లింగ్ ట్రిక్ ఉపయోగించి 20 కేజీల బరువున్న చేపల్ని కూడా ఈజీగా పట్టేసుకుంటున్నది. చేపలే కాదు దట్టమైన అడవుల్లోకి వెళ్లి వన్య ప్రాణుల్ని వేటాడుతుంటుంది. కొందరు విమర్శించినా.. హన్నా వాటిని పట్టించుకోవట్లేదు. ఏది ఏమైనా ఇన్‌స్టాగ్రాంలో 5 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకున్నది ఈ బ్యూటీ హంటర్.

257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles