అదిరిపోయే ఫిట్‌నెస్‌తో..


Sun,August 11, 2019 01:42 AM

Mandira-bedi-boxing
అలనాటి బుల్లితెర అందాలతార మందిరాబేడీ.. 47 యేండ్ల వయసులో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇటీవల కాలంలో వరుసగా తన ఫిట్‌నెస్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ.. కుర్రకారు మతులుపోగొడుతున్నది మందిరాబేడీ. 90వ దశకంలో శాంతి టీవీ సీరియల్ ద్వారా హోమ్లీ కేరెక్టర్‌తో బుల్లితెరకు పరిచయమైంది మందిరాబేడీ. ఆ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నది. ఇటీవలే 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. గతవారం ఓ వెకేషన్‌లో తీసిన బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల సూపర్ ఫిట్‌నెస్ బాడీతో జిమ్‌లో సాధన చేస్తున్న ఓ పిక్‌ను తన సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేసింది. అదిరిపోయే ఫిట్‌నెస్‌తో ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles