తాజావని గుర్తు పట్టడమెలా?


Mon,August 12, 2019 12:55 AM

పుచ్చులు, మచ్చలు లేనివే తాజావి అని అనుకుంటుంటారు. అయితే కొన్న రెండు రోజులకే అవి వాడిపోతుంటాయి. కొన్ని పనికిరాకుండా పోతాయి. కంటికి ఇంపుగా కనిపించేవన్నీ తాజావి కావు. మరి ఎలా వాటిని గుర్తించడం అంటే..
vigetables
-బఠానీలు రాళ్ల లెక్క గట్టిగా కాకుండా, కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోవాలి. బఠానీలు చేతిలో పట్టుకున్నప్పుడు స్మూత్‌గా ఉండేట్లు చూడాలి. రంగు ఆకుపచ్చగా ఉండేట్లు చూస్తే మంచిది. బీట్‌రూట్‌ను గిచ్చి చూస్తే ఎరుపు రంగులోనే కనిపించాలి. తొక్కమీద పగుళ్లు లేకపోతే అవి తాజావని అర్థం.
-ఉల్లిగడ్డలు పైపొర ఎండిపోయి గులాబీరంగులో ఉండాలి. లోపలి రేకులు గుండ్రంగా, గట్టిగా కనిపిస్తే అవి తాజావి. పుట్టగొడుగులు కొంచెం మెత్తగా, గుండ్రంగా జిడ్డుగా ఉండాలి. ఆలుగడ్డలు గట్టిగా ఉంటే తాజావని అర్థం. మట్టితో నిండినట్లు, బూడిద పూసినట్లు ఉన్నవి కొనకపోవడం మంచిది.
-పచ్చి బీన్స్ తీసుకోవాలి. కొనేటప్పుడు చేత్తో తాకి గుండ్రంగా ఉన్నాయో లేదో చూడాలి. బెండకాయ పొట్టిగా ఉన్నా పొడవు ఉన్నా సన్నటివి ఏరుకోవాలి. పొట్టలు మెత్తగా ఉండాలి. తొడిమల్ని వేళ్లతో విరిచినప్పుడు విరిగితే అవి తాజావని అర్థం.
-నిగనిగలాడే వంకాయలపై పుచ్చులు లేకుండా చూసుకోవాలి. లావుగా ఉన్నాయంటే ముదిరినట్లే. బీరకాయలపై ఉండే అంచులు గిచ్చితే పచ్చిగా ఉంటే తాజావని అర్థం. కొత్తిమీర, మెంతికూర ఆకులు చేతికి మెత్తగా తగులుతూ, పచ్చగా ఉండాలి. వాడిపోయినా, పసుపు రంగులోకి మారినా కొనవద్దు.

491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles