ఐసీయూ చికిత్స కీలకమా?


Mon,August 12, 2019 12:57 AM

మా మిత్రుడి వయసు 38 ఏండ్లు. శ్వాసకోశ సమస్యలు ఉంటే హాస్పిటల్‌లో చేర్పించాం. నాలుగు రోజుల తర్వాత కోలుకున్నాడు. ఇక ఐసీయూ నుంచి బయటకు షిఫ్ట్ చేయించాం. డాక్టర్ వద్దని వారించారు. అయితే ఉన్నట్టుండి ఒకరోజు పరిస్థితి విషమించి చనిపోయాడు. ఐసీయూలో ఉంచి ఉంటే బతికేవాడని ఇప్పుడు అనిపిస్తున్నది. ఐసీయూ గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. మా మిత్రుడు నిజంగానే ఐసీయూలో ఉంచకపోవడం వల్లనే చనిపోయాడంటారా? ఐసీయూలో ఎలాంటి ప్రత్యేక చికిత్సలు అందుతాయో తెలుపగలరు.
- డి. ముకుందరావ్, ఆదిలాబాద్

Counselling
శరీరం పలు రకాల ఖనిజాలు, జీవ రసాయనాల ఆధారంగా పనిచేస్తుంది. వ్యాధిగ్రస్తుల్లో వీటి స్థితిగతుల్లో ఎన్నో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. శరీర వివిధ భాగాలు చాలా వేగంగా దుష్పరిణామాలకు లోనై హోమియోస్టేసస్ దెబ్బతింటుంది. అంటే సహజమైన సమతుల్యత అన్నమాట. ఐసీయూలో ఉంచితే వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉండటంతోపాటు వాటిని క్రమబద్ధం చేసే ఏర్పాట్లు నిరంతరాయంగా ఉంటాయి. తిరిగి కోలుకునేందుకు అవసరమైన వైద్య చికిత్సలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ హఠాత్తుగా ఏదైనా జరిగితే ప్రమాదాన్ని నిరోధించే అవకాశాలు ఐసీయూలోనే ఉంటాయి. నిపుణులైన వైద్యులు సమక్షంలో చికిత్స అందుతుంది కాబట్టి పరిస్థితి విషమించకుండా చూసుకోవచ్చు. మీ మిత్రుడి విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుంది. కాబట్టి పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు మీ సౌలభ్యం కోసమని చెప్పి రోగిపై ఎలాంటి ప్రయోగాలు చేయకండి. ప్రాణం పోయినంక ఎంత బాధ పడితే ప్రయోజనం ఏంటి?

-డాక్టర్. జి. భవాని ప్రసాద్
-కన్సల్టెంట్ క్రిటికల్
-కేర్ స్పెషలిస్ట్, కేర్ హాస్పిటల్, హైటెక్‌సిటీ

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles