చర్మానికి హాని చేస్తున్నారా?


Mon,August 12, 2019 12:59 AM

సాధారణంగా కాంతులీనే చర్మం కోసం సౌందర్య సాధనాలను వాడతారు. అయితే చర్మ సౌందర్యం కోసం ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు చర్మ నిపుణులు. అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ జాగ్రత్తలు పాటించా లంటున్నారు.
Fair-skin
-అవసరానికి మించి మాయిశ్చరైజర్లు, సన్‌క్రీం లోషన్లు ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. వీలైనంత వరకు మాయిశ్చరైజర్లు, లోషన్లు వాడకపోవడమే మంచిది. సహజసిద్ధ చిట్కాలు పాటించడం మేలు.
- మొటిమలు లేదా కురుపులు అయినప్పుడు వాటిని పదేపదే చేతితో తాకొద్దు. అపరిశుభ్రమైన చేతులతో ముఖాన్ని తాకడం, రుద్దడం వల్ల బ్యాక్టీరియా చర్మానికి హాని చేస్తుంది. ముఖానికి చెమట పట్టినట్లు అనిపించినా, ముఖం జిడ్డుగా మారినట్లు అనిపించినా నీళ్లతో కడుక్కోవాలి. కానీ చేతులతో ముఖాన్ని తాకొద్దు.
- అందంగా కనిపించడం కోసం లోషన్లు, క్రీమ్‌లను ముఖంతోపాటు మెడ, చెవుల వెనుక భాగంలో కూడా ఐప్లె చేయడం మర్చిపోరాదు. దాంతో అంతా ఒకే షేడ్‌తో ఉండి, ముఖం రంగు మారినట్లు కనిపించదు.
- చర్మం మీది మృతకణాలను తొలిగించడం చాలా ముఖ్యం. జిడ్డు చర్మం ఉన్నవాళ్లతో పోలిస్తే సాధారణ చర్మం ఉన్నవాళ్లు వారంలో ఒక్కసారి చేస్తే చాలు. అదే పనిగా మృతకణాలను తొలిగించే ప్రయత్నం చేయడం వల్ల చర్మం దెబ్బతీస్తుంది.

493
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles