ప్రపంచవేదికలపై మన ట్రాన్స్‌మోడల్ విజయం


Mon,August 12, 2019 01:00 AM

మెయిన్ స్ట్రీమ్‌లో ట్రాన్స్‌జెండర్ల ప్రతిభకు గుర్తింపు లభిస్తున్నది. ఢిల్లీకి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మోడల్ మిస్ వరల్డ్ డైవర్సిటీ 2019 టైటిల్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
trans1
ఢిల్లీకి చెందిన నాజ్ జోషి దేశానికి గుర్తింపు తెచ్చింది. ఇటీవల మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌లో జరిగిన మిస్ వరల్డ్ డైవర్సిటీ 2019 పోటీల్లో కిరీటాన్ని దక్కించుకున్నది. నాజ్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. 14 మంది ప్రపంచవ్యాప్త పోటీదారులకు సవాలు విసిరి ఈ పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ టైటిల్‌తో పాటే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రధారణతో పోటీల్లో పాల్గొన్నందుకు ఉత్తమ కాస్ట్యూమర్‌గా, మిస్ కాంజినియాలిటీ (అందరితో స్నేహపూర్వకంగా ఉండడం, నాణ్యమైన పని లక్షణాలను కలిగి ఉండే వ్యక్తులకు ఇచ్చే గుర్తింపు) బిరుదును కూడా పొందింది. 2017లో మిస్ రిపబ్లిక్ ఇంటర్నేషనల్ బ్యూటీ అంబాసిడర్‌గా, మిస్ యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్‌గా నిలిచింది. జోషి 2013లో లింగమార్పిడి చేసుకుంది. ఆ తర్వాత మోడలింగ్‌లో చేరింది. లింగ వివాదాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చి ట్రాన్స్ ఉమెన్‌కు రోల్‌మోడల్‌గా నిలిచింది. అందాల పోటీల్లో పాల్గొనగా వచ్చిన డబ్బును ట్రాన్స్ జెండర్ల కోసం వెచ్చించేది. ఈ విజయాలను సాధించడంతో నా శక్తి ఏంటో నాకు తెలుస్తున్నది. సమాజం కోసం నేను ఇంకా ఏం చేయాలో తెలుసుకుంటున్నాను. ట్రాన్స్ జెండర్ల గుర్తింపు కోసం నేను ఇంకా కృషి చేస్తాను. సమాజంలో ప్రతి ఒక్కరూ మమ్మల్ని గుర్తించాలి అంటున్నది నాజ్.

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles