అరుదైన ఘనత మధుర సొంతం


Mon,August 12, 2019 01:02 AM

మహిళా సినిమాటోగ్రాఫర్‌గా మధుర పాలిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డుకు ఎంపికైంది. పురుషులు మాత్రమే రాణించగలిగే ఈ విభాగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నది.
madhura-cinimatographer
కోల్‌కతాకు చెందిన మధుర పాలిత్ తల్లిదండ్రులు ఫొటోగ్రాఫర్లు. దీంతో ఆమెకు చిన్నతనం నుంచే సినిమాటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. అభిరుచినే కెరీర్‌గా మలుచుకోవాలనుకుని సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. అక్కడ రెండేళ్లు ఫొటోగ్రఫీలో కోర్సు చేసింది. అనంతరం పలు డాక్యుమెంటరీలు, ఫార్ట్‌ఫిల్మ్స్‌కు పనిచేసింది. వాటిలో బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన పేపర్ బాయ్ షార్ట్ ఫిల్మ్.. మధుర పాలిత్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. 2015లో లుకింగ్ చైనా యూత్ ఫిల్మ్ ప్రాజెక్టు కోసం తెరకెక్కించిన ద గర్ల్ ఎక్రాస్ ద స్ట్రీమ్‌కు డీఓపీగా తన సత్తా చాటింది. సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థిగా మొదలైన ఆమె.. అక్కడే అధ్యాపకురాలిగా ఫొటోగ్రఫీ పాఠాలు చెప్పింది. ఏషియన్ ఫిల్మ్ అకాడమి సహకారంతో సొంతగా ఆమె మూడు ఫీచర్ ఫిల్మ్స్ తీసింది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అంజెనియోక్స్ స్పెషల్ ఎంకరేజ్‌మెంట్ అవార్డు అందుకున్నది మధుర. మహిళలందరూ సామాజిక కట్టుబాట్లతో కొన్నిరంగాల్లో ప్రవేశించలేకపోతున్నారు, వారికి అవకాశం ఇస్తే తప్పక విజయం సాధించి చూపిస్తారు అంటున్నది మధుర పాలిత్. భారతదేశంలోనే మొదటిసారిగా ఈ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకున్న మధుర పాలిత్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.

504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles