చురుకుదనం తగ్గుతున్నదా?


Tue,August 13, 2019 01:21 AM

కొందరు పిల్లలు.. చాలా డల్‌గా కనిపిస్తుంటారు. దేనిమీదా ఆసక్తి కనబర్చరు. మనసెక్కడో ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు. అప్పుడు వారిపై కసురుకోకుండా వారితో ప్రేమగా ఉండాలని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అదొక మానసిక సమస్య.
ADHD
పిల్లల ఆలోచనా విధానంలో మార్పు రావడం.. ఆబ్సెంట్ మైండ్‌తో ఉండటాన్ని attention deficit hyperactivity disorder (ADHD) అంటారు. హార్మోన్లు, విటమిన్ల వల్ల కొందరికి ఈ సమస్య వస్తే.. మరికొందరికి జన్యుపరమైన సమస్యల వల్ల వస్తుంది. చాలామందికి మేనరికం వల్ల తమకు పుట్టిన బిడ్డల్లో ఏడీహెచ్‌డీ సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలను గమనిస్తే.. వారు తోటి పిల్లలతో ఎలా ఉంటు న్నారో పరిశీలించాలి. మూడ్ ఆఫ్‌లో ఉండకుండా ఏదో ఒక ఆసక్తికర విషయంపై చర్చిస్తుండాలి. ప్రశాంత వాతావరణం కల్పించాలి. క్రియేటివిటీకి అవకాశం ఉన్న ఆటలవైపు దృష్టి మళ్లించాలి. సంగీతం.. పెయింటింగ్.. డ్యాన్స్ వంటివి అలవాటు చేస్తే మెదడలో ఆహ్లాదకర భావాలు ఏర్పడుతాయి. ఇవి మానసిక పరిస్థితిని అదుపుచేయడానికి, ఎదుగుదలకు తోడ్పడుతాయి.

58
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles