కాఫీతో పార్శపునొప్పి


Tue,August 13, 2019 01:22 AM

కాఫీ.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నూతన ఉత్తేజం వస్తుంది. ఇలా రిఫ్రెష్‌మెంట్ కోసమనీ ఏం చేస్తుం టాం? రోజులో ఐదారు కాఫీ లు తాగుతాం. ఇది కనిష్ఠంగానే. అయితే మూడుకంటే ఎక్కువసార్లు తాగితే దుష్ప్రభావాలు తప్పవని అంటున్నారు నిపుణులు.
Migraine-Rrisk
తలనొస్తుంది అని కాఫీ తాగుతాం. కానీ అదే కాఫీ మరో రకం తలనొప్పిని కలిగిస్తుందనే నిజాన్ని తెలుసుకోవాలని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. Beth Israel Deaconess Medical Center (BIDMC)కు చెందిన పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం చేశారు. మోతాదుకు మించి కాఫీ తాగడం వల్ల అది మెదడుపై ప్రభావం చూపిస్తుందట. రోజులో గరిష్ఠంగా మూడుసార్ల కంటే ఎక్కువ కాఫీలు తాగడం వల్ల ముఖ్యంగా పార్శపునొప్పి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. సంతోషంగా ఉన్నా.. ఆందోళనలో ఉన్నా కాఫీ తాగే అలవాటు పెరిగిపోతుందని.. ఇది అంత మంచిది కాదని వారు సూచిస్తున్నారు. మూడుసార్లు మించకుండా తాగితే కాఫీతో రిఫ్రెష్‌మెంట్ కలుగుతుందని వెల్లడించారు.

43
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles