సీ-విటమిన్ తీసుకోండి


Mon,August 12, 2019 11:40 PM

ఆధునిక జీవనశైలి వల్ల విటమిన్ల లభ్యత సరిగా ఉండటం లేదు. అలాంటి వాటిలో సీ- విటమిన్ ముఖ్యమైంది. ఇది కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. దంతాలలో డెంటిన్ పదార్థం ఏర్పడటానికి కూడా సీ-విటమిన్ ఉపయోగపడుతుంది.
Vitamin-C
ఏ సమస్యా రాకుండా శరీరాన్ని కాపాడేది రోగనిరోధక వ్యవస్థ. అయితే సీ-విటమిన్ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగాలు దాడి చేస్తాయి. గాయాలు త్వరగా మానవు. ఎముకలు విరిగితే త్వరగా అతుకవు. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ఉసిరి, జామ, టమాటా, ఆకు కూరల్లో పుష్కలంగా సీ-విటమిన్ ఉంటుంది. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా తినాలి. సప్లిమెంట్స్ ద్వారా కూడా సీ-విటమిన్ అందకపోతే రక్తనాళాలు పెళుసుగా మారుతాయి. చిగుళ్లు చిట్లి రక్తస్రావం అవుతుంది. స్కర్వీ వ్యాధి సోకుతుంది.

61
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles