బాధితుల కోసం త్రిమూర్తులుగా!


Wed,August 14, 2019 12:24 AM

కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు వారం రోజులుగా బీభత్నాన్ని ఎదుర్కొంటున్నాయి. 79 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడడం, వరదలు పెద్ద ఎత్తున సంభవించాయి. దీంతో సరైన సదుపాయాలు లేక ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో సేవకులుగా ముందుకు వచ్చారు ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులు ..
offiecers
కర్ణాటకలోని కొడగు ప్రాంతం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. వరదలు ముంచెత్తాయి. పరిస్థితిని మామూలు స్థితికి తీసుకురావడానికి ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. డిప్యూటీ కమిషనర్ అన్నీస్ కన్మణి జాయ్, ఎస్పీ డాక్టర్ డి పెన్నేకర్, సిఈఓ-జెడ్‌పి కె లక్ష్మి వేర్వేరు శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న సివిల్ అధికారులు. వరదల తాకిడికి గ్రామాల పరిస్థితి నుంచి సమీక్షలకే పరిమితం కాలేదు. మేమూ వస్తాం అని సేవలందించేందుకు క్షేత్రస్థాయిలోకి దిగారు. కిందిస్థాయి అధికారులతో కలిసి బాధితులకు చేయందిస్తున్నారు.సదుపాయాలు, సౌకర్యాలను, ఆహారం, మౌలిక వసతిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధ్యతలు చేపట్టకముందే వీరిది ఘనమైన నేపథ్యం. అన్నీస్ కన్మణి జాయ్‌ది కేరళలోని ఎర్నాకుళం జిల్లా. త్రివేండ్రం మెడికల్ కాలేజ్‌లో బీఎస్సీ నర్సింగ్ చేసింది. ఆ తర్వాత 2012లో భారతీయ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్‌గా ఎంపికైంది. వినాశకరమైన కొండచరియలకు వ్యతిరేకంగా అగ్నిమాపక పోరాటంతో పాటు ఈ పదవిని చేపట్టి కొన్ని నెలల్లోనే వృత్తికి ప్రతీకగా మారింది. రెండవ అధికారిణిగా డాక్టర్ సుమన్ పెన్నేకర్. ఈమె పోలీస్. కొడగులోని కలప మాఫియా అయిన కింగ్‌పిండా కల్లిచంద నోబన్‌ను అరెస్ట్ చేసింది. అతను దోచుకున్న కోట్ల విలువైన కలపను సుమన్ స్వాధీనం చేసుకున్నది. అంతేకాకుండా డిసి పిఐ శ్రీవిద్య, పోలీస్ మహిళా ఏజెన్సీలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన 1200 మంది సిబ్బందితో కలిసి వరదలు, కొండచరియల కారణంగా చిక్కుకున్న 4,300 మందిని రక్షించడానికి పనిచేస్తున్నది సుమన్. మూడో అధికారిణి లక్ష్మి ప్రియా. జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే తనదైన ముద్ర వేసుకున్నది. వీరు ఆ గ్రామ ప్రజలకు కావాల్సిన ఆహారం, దుస్తులు, పిల్లలకు చదువు అన్ని సదుపాయాలు, భద్రతా కల్పిస్తున్నారు.

331
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles