12 గంటల్లో 35 కోట్ల మొక్కలు!


Fri,August 16, 2019 12:40 AM

Paryavaranam
తూర్పు ఆఫ్రికాకు చెందిన ఇథియోపియా దేశంలో అనూహ్యంగా కేవలం 12 గంటల్లోనే 350 మిలియన్ (35 కోట్లు) మొక్కలను నాటినట్లు అక్కడ్నించి అధికారిక సమాచారం వెలువడింది.

ఆ దేశ ప్రధానమంత్రి అబి అహ్మద్ (Abiy Ahmed Ali) ప్రవేశపెట్టిన గ్రీన్ లెగెసీ ఇనీషియేటివ్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల (జూలై చివరన) ఈ అరుదైన రికార్డును సాధించారు. ప్రభుత్వోద్యోగులు సైతం కార్యాలయాలను మూసేసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆయన ఇచ్చిన పిలుపు బ్రహ్మాండంగా పనిచేసినట్టు చెబుతున్నారు. అక్కడ సుమారు 35 శాతం మేర వున్న అడవుల విస్తీర్ణం 2000 సంవత్సరం కల్లా 4 శాతానికి పెద్ద ఎత్తున పడిపోయిన క్రమంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విస్తృతరీతిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకరోజు 24 గంటల్లో 1,000 ప్రదేశాలలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయిస్తే, దీనిని అధిగమిస్తూ కేవలం 12 గంటల్లోనే 35 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ఒకే రోజులో 50 మిలియన్ (5 కోట్లు) మొక్కలు నాటిన ప్రపంచ రికార్డును మన భారతదేశం 2016లో సాధించగా, దీనిని ఇప్పుడు ఇథియోపియా అధిగమించింది.

237
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles