తుప్పునుండి విద్యుదుత్పత్తి!


Fri,August 16, 2019 12:42 AM

Padartha
తుప్పుపొరల మీదుగా ఉప్పునీటిని ప్రవహింపజేయడం వల్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి అనుగుణమైన సాంకేతిక విధానాన్ని ఇటీవల వారు అభివృద్ధి పరిచారు.

అందుబాటులో ఉన్న సౌరఫలకల పద్ధతిలోకంటే కూడా ఈ సాంకేతికత ద్వారా అధిక విద్యుత్తును తయారుచేయవచ్చునని వారంటున్నారు. క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్), నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ (అమెరికా)కి చెందిన పరిశోధకులు అభివృద్ధి పరిచిన ఈ సాంకేతికతను ఫిజికల్ వేపర్ డిపోజిషన్ (పీవీడీ) విధానంగా పిలుస్తున్నారు. ఇందులో ప్రధానంగా తుప్పు పదార్థం (Iron oxide) మీదుగా ఉప్పునీటిని ప్రవహింపజేస్తారు. ఫలితంగా జరిగే రసాయనిక చర్యతో విద్యుచ్ఛక్తి ఉత్పత్తవుతుందని వారు పేర్కొన్నారు. ఐరన్ ఆక్సైడ్‌తోనే కాకుండా, గ్రఫేన్‌పైనా ఉప్పునీటిని ప్రవహింపజేసినా విద్యుదుత్పత్తి సాధ్యమేనని, కాకపోతే ఇది ఒకింత కష్టమని వారు తెలిపారు. మామూలు నీటివల్ల ఇనుము తుప్పు పట్టిపోతే, ఆ పాడైన పదార్థాన్ని ఉప్పునీటితో కలపడం ద్వారా తిరిగి విద్యుత్ రూపంలో వినియోగంలోకి తేగలగడం విశేషమే. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆన్‌లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

511
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles