అగ్గి పురుగుల ఆకర్షణ శక్తి


Fri,August 16, 2019 12:44 AM

Prakriti-Patham
మన కంటికి కనిపించనంత దూరంలో చెలరేగే మంటల్ని అద్భుతమైన తమ ఇంద్రియ శక్తిద్వారా గుర్తుపట్టే అగ్గివేట పురుగులు ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలకు సరికొత్త స్ఫూర్తినిస్తున్నాయి. ఫలితంగా రాబోయే అగ్ని ప్రమాదాలను ముందే పసిగట్టే అవకాశం లభిస్తుందని వారంటున్నారు.

చల్లని కాంతిని విరజిమ్మే మిణుగురు పురుగుల (Firefly) గురించి తెలిసినంతగా మనకు కాంతివాసనను పట్టేసి అగ్గివేట కీటకాల (fire-chaser beetles) ఆకర్షణ శక్తి అంతగా తెలియదు. అడవుల్లో చెలరేగే మంటల్ని వాతావరణంలో వ్యాపించే పొగలు, పరారుణ కాంతి వికిరణ (Infrared radiation) ప్రభావం ద్వారా ఈ పురుగులు పసిగడుతున్న సంగతిని 1960లలోనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మెలనోఫిలా (Melanophila) తరగతికి చెందిన ఈ అగ్గివేట కీటకాలపై జరిపిన లోతైన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అడవులు తగులబడుతున్న (కార్చిచ్చు) ప్రదేశంలో ఈ పురుగుల లార్వాకు ఆహారం పుష్కలంగా దొరుకుతున్నట్టు వారు గుర్తించారు.
Prakriti-Patham1
ఈ పురుగుల రెండు కాళ్లకింద ఉష్ణవాసనను పసిగట్టే గ్రాహకాలు (సెన్సర్లు) ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి కొన్ని వెంట్రుకల మందంతో, 70కి పైగా సంఖ్యలో, డోమ్ ఆకారంలో ఉంటాయి. కొన్ని కీటకాల కండ్ల మాదిరిగానే ఈ సెన్సర్లు ఉంటాయని, మంటలతోపాటు వేడి వస్తువుల నుండి వెలువడే పరారుణ కిరణాలను వీటి ఆధారంగానే అవి గుర్తిస్తాయని వారు తెలిపారు. సూక్ష్మమైన ఈ సెన్సర్లు ఒక విధమైన ద్రవంతో నిండి ఉండి, పరారుణ కాంతిని శోషించుకొనే శక్తిని కలిగి ఉంటున్నట్టు వారు కనుగొన్నారు. ఈ రకంగా వాటికి అంతటి శక్తి సమకూరుతున్నది.

మెర్రిమాన్ (merriman) తరగతికి చెందిన అగ్గివేట పురుగు ఆధారంగా యూనివర్సిటీ ఆఫ్ బోన్న్ పరిశోధకులు మైక్రోబోలోమీటర్ (microbolometer: సూక్ష్మవిద్యుదయస్కాంత వికిరణ శక్తిని కొలిచే పరికరం)ను రూపొందించారు. పై పురుగుల వలె దీనిలోనూ కృత్రిమ థర్మోసెన్సర్లను వారు ఏర్పరిచారు. దీనిని మరింతగా అభివృద్ధి పరచడం ద్వారా కార్చిచ్చుల వంటి విపత్తుల నివారణ సాధ్యపడగలదని వారు అంటున్నారు.

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles