ఐవీఎఫ్ విఫలమైతే?


Tue,August 20, 2019 01:27 AM

ఇక మీరు తల్లి కాలేరు అనే మాట వింటే ఎంత బాధ కలుగుతుంది? మీరు కన్న కలలు.. ఆశలు.. నిరాశగా మారి జీవితంపై నమ్మకం కోల్పోతారు. అలాంటి ఆశా.. నిరాశల్ని పటాపంచలు చేస్తూ సంతాన సాఫల్య భాగ్యం
కలిగిస్తుంది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). ఇదీ ఫెయిలైతే ఏం చేయాలి?

IVF
సంతాన సాఫల్య ప్రక్రియలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అద్భుతాలను సృష్టిస్తున్నది. అసలు పిల్లలే పుట్టరు అనుకొని.. చివరి ప్రయత్నంగా దీనిని ఆశ్రయించినవాళ్లకు మంచి ఫలితాలను చూపిస్తున్నది. ఫెర్టిలిటీ సెంటర్‌లోకి అడుగుపెట్టి.. సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు.

ఐవీఎఫ్ అంటే?

జీవనశైలి.. ప్రాధాన్యాలు మారడం వల్ల నేటి ప్రపంచంలో సంతానం లేకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నది. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టినా పిల్లలు పుట్టడం లేదు. ఇక లాభం లేదనుకొని కొందరు ఇంజెక్షన్‌లు, మందులు, కృత్రిమ వీర్యం, ఇంట్రాయూటిరిన్ బదిలీలు వంటి ఆధునిక పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వాటిలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) కూడా ఒకటి. సంతాన సాఫల్యం కోసం అందుబాటులో ఉంటున్న మంచి ఉపకరణం ఐవీఎఫ్.

విచారం వద్దు.. అవగాహన ముద్దు

ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. పైసలు వృథా అవుతున్నాయి కానీ ఫలితం ఎలా ఉంటుందో అన్న అనుమానాలూ ఉన్నాయి. వాటన్నింటినీ పాజిటివ్‌గా తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఐవీఎఫ్ ప్రక్రియ విఫలం చెందినా కూడా విచారించవద్దు. సంతాన సాఫల్యంలో మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. సేకరించిన అండాన్ని ప్రయోగశాలలో వీర్యంతో కలిపి ఐవీఎఫ్ నిపుణుల పర్యవేక్షణలో విభజించబడుతుంది. అక్కడి నుంచి గర్భాశయంలోకి బదిలీ చేస్తే.. ప్రక్రియ విజయవంతంగా కొనసాగి ప్రెగ్నెన్సీ వస్తుంది. అయితే కొందరిలో ఈ ప్రక్రియ సక్రమంగా జరకగపోవడంతో ఐవీఎఫ్ సైకిల్ విఫలం అవుతుంది. అప్పుడు ఎందుకు విఫలమైందో డాక్టర్ విశ్లేషిస్తారు. హార్మోనల్ సప్లిమెంట్ల సహాయంతో మరోసారి ప్రక్రియను ప్రారంభించడం మంచిది.

వైఫల్యానికి కారణమేంటి?

ఐవీఎఫ్ సైకిల్‌ను మొదలుపెట్టడానికి ప్రాథమిక ఆవశ్యకతలు లభించకపోతే ఐవీఎఫ్ విఫలమవుతుంది. కొన్నిసార్లు మాత్రలు, హార్మోనల్ సప్లిమెంట్స్ విఫలమైతే స్త్రీ పునరుత్పత్తి అవయవం కావాల్సిన రూపానికి చేరుకోదు. ప్రేరేపిత హార్మోన్‌ను ఉపయోగించినా కూడా అండాశయం బహుళ గ్రీవాల్ని ఉత్పత్తి చేయదు. బహుళ గ్రీవాలు ఉత్పత్తయిన తర్వాత కూడా వాటిలో అండాలు ఉండవు. బహుళ గ్రీవాల్ని ఉత్పత్తి చేయడానికి కారణం ఆరోగ్యవంతమైన ఫలదీకరణ చెందిన అండం. దీనిని బదిలీ చేసే అవకాశాన్ని పెంచడం కోసం బహుళ అండాలు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఐతే తిరిగి పొందిన ప్రతీ అండం సజీవంగా ఉండదు. ఒకవేళ ఉన్నా కావాల్సినంత పరిణతి చెందదు. పిండంగా మారడానికి ఫలదీకరణ చెందవు. కొన్నిసార్లు ఫలదీకరణ చెందిన అండాల్ని ఉత్పత్తి చేయడానికి గర్భాశయంలోకి చేరుకున్నా ఇంప్లాంటేషన్ ప్రక్రియ ప్రమాదకరంగానే ఉంది. ఐవీఎఫ్ ప్రయత్నం విఫలమవడానికి మరొక ప్రధాన అంశం రోగుల జీవిత శైలికి సంబంధించింది. 35 ఏండ్ల లోపు వారికి ఐవీఎఫ్ ఎక్కువగా ఫెయిల్ అవుతుంది. పొగ తాగే అలవాటు ఉన్న కూడా ఐవీఎఫ్ విజయవంతం కాదు.

ఐవీఎఫ్ పూర్తి ప్రక్రియలో నిర్లక్ష్యం పనికిరాదు. ఇది కేవలం శారీరకంగా, ఆర్థికంగానే కాకుండా ఉద్వేగభరితంగా, మానసికంగా కూడా ప్రభావానికి గురిచేస్తుంది. అందువల్ల సక్రమమైన సంరక్షణ, సహాయం పొందాలి. మిమ్మల్ని మీరు నమ్మితే ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది.

ఏం చేయాలి?


iv
నిజంగానే ఏదో ఒక పొరపాటు వల్ల ఐవీఎఫ్ విఫలం అయిందే అనుకోండి. అప్పుడేం చేస్తారు? మొదటి మహిళకు కొంత సమయం విశ్రాంతి ఇవ్వాలి. వెంటనే మరొక ప్రక్రియను ఆశ్రయించొద్దు. డాక్టర్‌తో మాట్లాడి ప్రక్రియ ఎక్కడ విఫలమైందో తెలుసుకోవడం రెండవ అత్యంత ప్రధానమైన చర్య. ఐవీఎఫ్ సైకిల్‌ను, వైఫల్యాన్ని విశ్లేషించుకోవాలి. మొదటి ఐవీఎఫ్ సైకిల్ విఫలమవడం మీ కలలు అంతమైనట్లు కనిపించినా వాస్తవం మాత్రం వేరుగా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఐవీఎఫ్ ప్రక్రియలో నిమగ్నమైన తర్వాత ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికంగా, మానసికంగా కుంగుబాటుకు దారితీసేలా వ్యవహరించొద్దు. ఇంప్లాంటేషన్ విఫలమైతే, పీజీఎస్ వంటి టెక్నిక్‌లు ఉంటాయి.
Dr-Shilpa-Reddy

90
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles