బ్రదర్ కాదు.. సిస్టర్!


Tue,August 20, 2019 12:27 AM

susma
ఎక్కువగా రద్దీ ఉండే నగరాల్లో కోల్‌కతా ఒకటి. అక్కడ కారు నడపాలంటే ఆషామాషీ కాదు. ఈ రద్దీలోనే ఆమె జీవిత ప్రయాణం మొదలైంది. ప్రయాణికురాలిగా కాదు.. ఓ క్యాబ్ డైవర్‌గా. కోల్‌కతాలో మొదటి కారు డ్రైవర్‌గా ఆమె సుపరిచితురాలైంది.
సైకిల్, బైక్, కారు.. ఏదైనా సరే వాటిని నడపడం సుష్మాకు ఇష్టం. ప్రత్యేకంగా కారు నడపడం అయితే ఒక కల. ఈ కల చాలా సరదాగా అనిపించినా ఆమెకు కొన్నాళ్ల తర్వాత ప్రొఫెషన్‌గా మారింది. బతుక్కు దారి చూపి ఉపాధి మార్గాన్ని చూపించింది. 30 యేండ్ల సుష్మాకు ఓ అబ్బాయి. సుష్మకు తన అభిరుచి పట్ల భర్త నుంచి ప్రోత్సాహం ఉంది. అందుకే ఎప్పటికైనా కారు డ్రైవింగ్ చేయాలనుకునేది. ఓ రోజు కోల్‌కతా ట్యాక్సీ ఎక్కింది. డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్న సుష్మా ఆ ట్యాకీవాలాతో డ్రైవింగ్ గురించి ముచ్చటించింది. దీంతో అతను స్పందిస్తూ ఇంత ఆసక్తి ఉంటే క్యాబ్ డ్రైవర్‌గా చేయొచ్చు కదా అని చాలా సాధారణంగా అన్నాడు.

కానీ సుష్మా మెదడులో ఆ మాటలు నిలిచిపోయాయి. వెంటనే స్థానికంగా ఓ డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది. తర్వాత కమర్షియల్ లైసెన్స్ అడిగే శిక్షకులు ఆశ్చర్యపోయారు. తను డ్రైవర్ కావాలనుకుంటున్నాని చెప్తే నివ్వెరపోయారు. కొద్ది రోజుల్లోనే లైసెన్స్ పొందింది. తర్వాత ఓ క్యాబ్ సర్వీస్ కంపెనీలోని డ్రైవర్ల జాబితాలో చేరింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న సుష్మ కుటుంబానికి ఇలా ఒక ఆసరా దొరికింది. రోజుకూ 15 ట్రిప్పులు తీసుకుంటుంది. డ్రాపింగ్, పికప్‌లో ఎలాంటి ఆసల్యమైనా కస్టమర్లు తీవ్రంగా స్పందిస్తారు. అవమానిస్తారు. ఇవన్నీ తట్టుకొని, తప్పులను దిద్దుకొని ముందుకు సాగుతున్నది. క్యాబ్‌బుక్ చేసుకున్న వారు కాల్ చేసి బ్రదర్ ఎక్కడ ఉన్నారు అని అడిగితే.. బ్రదర్ కాదు సిస్టర్ అంటూ సున్నితంగా వినిపించే సుష్మ మాటలు విని ఆశ్చర్యపోతుంటారు ప్రయాణికులు.

924
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles