కండ్లచుట్టూ నల్లటి వలయాలా?


Tue,August 20, 2019 12:29 AM

చాలామంది ముఖం చూడకుండా కండ్లతోనే మాట్లాడుకుంటారు. మరి అలాంటి కళ్లు ఉబ్బినట్లుగా, నలుపుగా ఉంటే చూడడానికి బాగుంటుందా? వీటిని నివారించడానికి కొన్ని పద్ధతులున్నాయి.
eye
-కొన్ని బాదంపప్పులను బాగా నానబెట్టి మెత్తని పేస్టులా చేయాలి. అందులో కొంచెం పాలు కలిపి రాత్రిపడుకనే ముందు కంటి చుట్టూ రాసుకోవాలి. నిద్ర లేవగానే చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి.
-అధిక ఒత్తిడి, అలసట వల్ల కండ్ల కింద వాచినట్లు అవుతుంది. అది పోవాలంటే.. వాడిన గ్రీన్ టీ బ్యాగులను చల్లటి నీటిలో ముంచి కంటి కింద వాపు ప్రాంతంలో పెట్టుకుంటే తగ్గుతుంది.
-వీటన్నింటికంటే మనిషికి సరిపడినంత అంటే రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. దీంతోపాటు పోషకాహారం తీసుకుంటే కండ్లు మిలమిలా మెరుస్తాయి.
-కీరదోస రసం కండ్లకి చాలా మంచిది. అది చర్మానికి మంచి టోనర్‌గా కూడా పనిచేస్తుంది. కీరదోస రసంలో దూది ముంచి కనురెప్పలపై పెట్టుకోవాలి. కొంచెం రసాన్ని కండ్ల కింద భాగంలో రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కండ్ల్లు అందంగా మారుతాయి.
-టమాటా గుజ్జు, నిమ్మరసం, శనగపిండి, పసుపు బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని కండ్ల చుట్టూ బాగా రాసుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకి ఒకసారైనా ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు త్వరగా తగ్గుతాయి.

1202
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles