హోమ్‌ డెకరేషన్‌ చేయండిలా!


Tue,August 20, 2019 12:36 AM

home-decoration
మనస్సు ఎక్కడుంటే అదే మన ఇల్లు అవుతుందన్నది నిజమే. రోజంతా ఎక్కడ తిరిగినా చివరికి ఇంటికి చేరాల్సిందే. మరి ఆ ఇంటిని నచ్చినట్టుగా అలంకరించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వండి.

రంగులేసిన నాప్‌కిన్లు :

ఆరు నాప్‌కిన్లను తీసుకొని నచ్చిన రంగులు వేయండి. తర్వాత నాప్‌కిన్ల్లను మడిచి అతిథులను ఇంటిని పిలిచినప్పుడల్లా తెల్లని ప్లేటులో పెట్టి అందిస్తే కొత్త నాప్‌కిన్లులాగే కనిపిస్తాయి. ఈ నాప్‌కిన్లను మ్యాట్లపై కూడా పెట్టొచ్చు.

పాత కుర్చీలకు కొత్త అందం :

ఇంటికి వేసిన రంగులు మిగులుంటే. పాత బల్లలు, కుర్చీలను ఎంచుకోండి. వీటికి మిగిలిన రంగులు వేసి ఇంట్లో పెట్టడం వల్ల ఇంటి గోడలు, కుర్చీలు మ్యాచింగ్‌లా ఉంటాయి. చూడడానికి కూడా ఆకర్షణీయంగానూ ఉంటుంది.

షట్టర్‌ ఉన్న సైడ్‌టేబుల్‌ :

ఇల్లు మారేటప్పుడు పాత షట్టర్‌ కిటికీ తలుపులను స్టోర్‌ రూంలో పడేస్తుంటారు. అందులో నాలుగింటిని క్యూబ్‌ ఆకారంలో అతికించాలి. దీనిపై గ్లాస్‌ స్లాబ్‌ పెడితే సైడ్‌ టేబుల్‌ రెడీ. దీనిపై కుండీ మొక్క, ఫ్లవర్‌ వాజ్‌ పెడితే అందంగా ఉంటుంది.

కర్టెన్లకు కొత్త దశ :

పాత కర్టెన్లను రోజూ చూసి బోర్‌ కొడుతుంటే, వాటి చివర్లన వేలాడే గుండ్రటి పోంపోంలను అతికించవచ్చు. ఈ చిన్న మార్పు కర్టెన్‌కు అదనపు అందాన్ని ఇస్తుంది. ఈ పద్ధ్దతినే దిండ్లు, కుషన్లకి కూడా చేయొచ్చు.

సూట్‌కేసు టేబుల్‌ :

ఆధునిక ఇళ్లలో స్టోరేజీ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పాత సూట్‌కేసులను కొత్తగా వాడొచ్చు. పాత సూట్‌కేసును బెడ్‌ చివర బల్లలోపల పెట్టవచ్చు. దీన్ని పుస్తకాలు పెట్టుకోవడానికి, దుప్పట్లు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు.

చిల్లర బ్యాంకు :

గుండ్రటి డబ్బా తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడువాలి. చిల్లర బ్యాంక్‌ అనే కొత్త టేబుల్‌ ప్రింట్‌ తీసి అతికించండి. దీనికి రంగులు కూడా వేస్తే బాగుంటుంది. డబ్బాకు చిన్న రంధ్రం వేసి దాన్ని చిల్లరకు ఉపయోగించుకోండి.

519
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles