మిస్‌ అమెరికా ఆఫ్‌ ది గన్‌ కమ్యూనిటీ


Wed,August 21, 2019 12:35 AM

Miss-America
అమెరికాలోని గన్‌ కల్చర్‌తో పెరుగుతున్న హింసపై అవగాహన కల్పించేందుకు ఓ మహిళ ముందుకొచ్చింది. గన్‌ కమ్యూనిటీల్లో ఉన్న అపోహలను తొలిగించి వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఐదుగురు పిల్లలకు తల్లి అయిన ఆమె సోషల్‌ మీడియా వేదికగా మారణాయుధాలపై ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నది.

అమెరికాలోని ఉటాకు చెందిన 27 ఏండ్ల కెసికర్రీ అనే మహిళ యూఎస్‌ హింసాత్మక దేశం కాదని నిరూపించేందుకు వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. కెసి కర్రీ హంటర్స్‌ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె నాలుగేండ్ల ప్రాయంలోనే మొదటిసారిగా తుపాకీ పేల్చింది. కెసి ఐదుగురు పిల్లలకు తల్లి. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గన్‌ కల్చర్‌నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నది.‘గన్‌ కమ్యూనిటీకి మంచి పేరున్నది. కొందరు ఆ పేరుకు మచ్చతెస్తున్నారు. వారి మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగానే ఇటువంటి హింసాకాండ పెరుగుతున్నదని’ చెబుతున్నది. గన్‌ కల్చర్‌పై ఉన్న దురభిప్రాయాన్ని మార్చడంతోపాటు పలు ఆయుధాల కంపెనీలకు చెందిన గన్‌లతో ఫోజులిస్తూ వాటిని ప్రమోట్‌ చేస్తున్నది. హంటర్స్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన కెసి ఇంటినిండా పలురకాల తుపాకీలున్నాయి. ‘తుపాకీలు కూడా ఇంట్లో ఉండే ఓ రకమైన వస్తువులేనని, వాటిని అవసరాన్ని బట్టే వాడాలని’ ఆమె సూచిస్తున్నది. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో విద్యార్థులకు గన్‌ కల్చర్‌పై అవగాహన కల్పిస్తే ఎటువంటి అఘాయిత్యాలూ జరుగవని ఆమె చెబుతున్నది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దేశంలో పెరుగుతున్న గన్‌ కల్చర్‌ నేరాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న మానసిక వైద్యశాలల మూసివేతే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను కర్రీ కూడా సమర్థిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3,33,000 మంది ఆమెను ఫాలో అవుతున్నారు. అందరూ కెసికర్రీని ఇప్పుడు ‘మిస్‌ అమెరికా ఆఫ్‌ ది గన్‌ కమ్యూనిటీ’గా పిలుస్తున్నారు.

268
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles