మతసామరస్యానికి ఆమె కృషి..


Fri,August 23, 2019 12:48 AM

దేశంలోని అన్ని మతాలు దాదాపూ ఒకే సందేశాన్నిస్తాయి. ఒకేరకమైన విషయాలను బోధిస్తాయి. ఇలాంటి అంశాలను తెలుసుకొని, వాస్తవ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయింది 17 ఏండ్ల ఆయేషా దత్. అందుకే మత సామరస్యం మీద అవగాహన కల్పించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేసిందామె!
religioun
మతసామరస్యం వెల్లివిరిసే దేశం మనది. సర్వమతాలకూ కేంద్రం ఈ నేల. పరమత సహనం, ఇతరుల పట్ల గౌరవం.. ప్రతి పౌరుడూ కలిగి ఉండాల్సిన నైతిక బాధ్యత ఈ అంశాలను అయేషా తెలుసుకుంది. నాలుగు నెలలు వేర్వేరు మతాల పెద్దలను కలిసి ఎవరి మతం ఏం బోధిస్తుందో తెలుసుకున్నది. అన్ని మతాల పెద్దలు చెప్పిన విషయాలను దాదాపూ సమానంగానే ఉన్నాయని గుర్తించింది. కానీ ఆమెకు వాస్తవం విరుద్ధంగా కనిపించింది. మత సామరస్యాన్ని కోల్పోయి, విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితులను చూసింది. దీంతో ఆమె ఆలోచనలో పడింది. మత సామరస్యం పట్ల యువతలో భారీ అవగాహన ముఖ్యం అని భావించింది. ఆమె నివాసం ఉండే గురుగ్రామ్ పరిధిలోని యువతతో మొదట ప్రయత్నం మొదలు పెట్టింది. ఇంటర్ చదువుతున్న ఈ అమ్మాయి.. అదే కాలేజీలోనే సదస్సులు నిర్వహిస్తున్నది. క్లాస్ రూమ్‌లలో మత సామరస్యానికి సంబంధించిన చర్చలు పెట్టి తోటి వారికి అవగాహన కల్పిస్తున్నది. త్వరలోనే ఆమె ప్రయత్నాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తరిస్తానని అంటున్నది. ఈ దేశం అన్ని మతాలకూ నిలయం, నేను మత పెద్దలతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్న. అలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోకుండా యువత తప్పుడు మార్గంలో వెళ్తున్నది. అందుకే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అంటున్నది ఆయేషా.

284
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles