పిండదశ పక్షిపిల్లల స్పందన


Fri,August 23, 2019 01:09 AM

సాధారణ సముద్రపక్షుల (నీరుకాకి లేదా సముద్రకొంగ)లో గుడ్లలోపల పిండదశలోని పిల్లల నడుమ సమాచార బదిలీ జరుగుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల ప్రయోగాత్మకంగా కనిపెట్టారు.
Jeeva-Shastram
పసుపుపచ్చ కాళ్ల సముద్రపక్షుల (yellow-legged gulls) పై జరిగిన ఈ పరిశోధన నేచర్ ఎకాలజీ అండ్ ఎవొల్యుషన్ ఆన్‌లైన్ పత్రిక ఇటీవలి సంచికలో ప్రచురితమైంది. ఉత్తరాది స్పెయిన్ (యూరప్ దేశం)కు చెందిన సాల్వొరా (Salvora) ఐలాండ్ (ద్వీపం)లోని ఒక పెద్ద పెంపుడు కేంద్రం నుండి పైజాతికి చెందిన 90 పిండపక్షుల గుడ్లపై వారు అధ్యయనం జరిపారు. ఒక్కో పక్షిగూడులో మూడేసి పక్షులను కొద్దిరోజులు వుంచి, తర్వాత పొదుగుకు ఆరు రోజులు ఉందనగా, రెండింటి చొప్పున గుడ్లను వేరు చేశారు. మిగిలిన ఒక్కో గుడ్డులోని పక్షిపిల్లలకు వేటాడే జంతువులు దగ్గరకు వచ్చిన శబ్దాలను వినిపించారు. అప్పుడు పక్కనున్న గూళ్లలోని మిగిలిన ఏకైక పక్షిపిల్లలకూ సమాచారం తెలిసిపోయినట్టుంది. వాటి గుడ్ల పెంకుల్లోనూ తీవ్ర కదలికలు సంభవించడం వారు పసిగట్టారు. ప్రమాదాన్ని పక్షిపిల్లలు గుడ్లలోపల కదలికల ద్వారా తోటి పిల్లలకు చేరవేస్తున్నట్టుగా దీనినిబట్టి వారు అవగాహనకు వచ్చారు.

265
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles