కొవ్వు విలువ


Fri,August 23, 2019 01:10 AM

Ahara-Shastram
ముఖ్యపోషకాలైనే కొవ్వు (Fat) పదార్థాలు శరీరశాస్త్ర పరంగా నిర్వర్తించే విధులనుబట్టి వాటి విలువను తెలుసుకోవచ్చు. మన ఒంట్లో కొవ్వు శాతం పరిధిని మించకూడదు. అలాగని, లోటు కాకూడదు. దేహశక్తికి సంపన్నమైన వనరుగా కొవ్వు పదార్థాలను ఆహారశాస్త్ర నిపుణులు పేర్కొంటారు. ఒక గ్రాము కొవ్వులో 9 కిలోక్యాలరీల శక్తి ఉంటుందని అంచనా. అంతే మొత్తంలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్), మాంసకృత్తుల (ప్రొటీన్లు)కన్నా రెట్టింపు ఎక్కువ శక్తిగా వారు దీనిని చెప్తారు. కొన్ని రకాల విటమిన్లు (ఉదా॥కు విటమిన్ ఎ, డి, ఇ, కె) దేహంలో జీర్ణమై, వినియోగం కావడానికిగాను కొంత కరిగే గుణం గల కొవ్వు పదార్థమూ వాటికి అవసరమని వారంటారు.

ఈ రకమైన విటమిన్లకు కావలసిన కొవ్వు మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో తప్పక ఉండాలి. లేకపోతే, సదరు విటమిన్ల కొరత ఏర్పడుతుంది. చర్మం లోపలి కొవ్వుపొర వల్లే శరీరంలో సగటు ఉష్ణోగ్రత నిర్వహణ సజావుగా ఉంటుంది. దేహంలోని కొన్ని ముఖ్య అవయవాలకు కొవ్వు ఒక కుషన్ (మెత్తని దిండు)లా ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలు వండటానికి లేదా నూనెల్లో వేయించడానికి కొవ్వు పదార్థాలు ఎంతో కొంతమేర అవసరం. అప్పుడే వాటికి తగిన రుచి లభిస్తుంది. కొవ్వు పదార్థాలు దేహంలో జీర్ణం కావడానికి కొంత ఎక్కువ సమయం తీసుకొంటాయి కనుక, అంతవరకు పొట్టలో ఆహారం ఉందన్న భావనను, తృప్తిని అవి కలిగిస్తాయి.

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles