ఏనుగులలో జల ఘ్రాణశక్తి!


Fri,August 23, 2019 01:13 AM

మనిషిని మించిన ఘ్రాణశక్తి ఏనుగులకు ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరంలోని నీటిజాడలను ఇవి వాసనతో గ్రహించేస్తాయని వారు అంటున్నారు. ఈ జీవసాంకేతికత ఆధారంగానే జలశోధనా పరికరాలను తయారుచేస్తున్నారు.
Prakriti-Shastram
గజరాజుకు ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. కొన్ని మైళ్ల దూరంలోని నీటిజాడలను అవి తేలిగ్గా వాసనల ద్వారా కనిపెడతాయని శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా తెలుసుకొన్నారు. అవి తమ నోటితో చేసే శబ్ద తరంగాలను దూరంగా ఉన్న తోటి ఏనుగులు సంకేతాలుగా గ్రహిస్తాయని వారు గుర్తించారు. ఇవి భూమిలో తమ పాదాలతో రాపిడి చేసి, మట్టి లోపల శబ్దాలను సృష్టిస్తాయి. తద్వారా సమాచారాన్ని తోటి ఏనుగులకు బదిలీ చేస్తాయని వారంటున్నారు. ఈ శబ్ద ప్రకంపనల ఆధారంగా తోటి ఏనుగులు నీటిజాడల విషయాన్ని తెలుసుకొంటున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మనం ఇవాళ వినియోగిస్తున్న సెల్‌ఫోన్ వంటి సాంకేతిక పరికరాలు ఇలా శబ్దతరంగాల సహాయంతో పనిచేస్తున్నవే. ఏనుగులు వంటి జంతువులకు భూమిలో వీటిని సృష్టించడం ద్వారా సమాచారాన్ని చేరవేసుకొనే శక్తి ఉన్నట్టు వారు అంటున్నారు.
వాసన పసికట్టే శక్తి కూడా ఏనుగులకు ఎక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సుమారు 19 కి.మీ. దూరంలోని నీటిజాడలను ఇవి తేలిగ్గా నీటి వాసనద్వారా కనుగొంటాయనీ వారు పరిశోధనాత్మకంగా గ్రహించారు. వీటి తొండాలకు దగ్గరగానే నాసికా రంధ్రాలుంటాయి.

Prakriti-Shastram2
వీటి ఘ్రాణశక్తి మనుషులలోని వాసన పీల్చే శక్తికన్నా అనేక రెట్లు ఎక్కువని వారన్నారు. రాబోయే తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులను సుమారు 160-240 కి.మీ. దూరం నుంచే ఇవి పసిగట్టేస్తాయని వారు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన పరిశోధకులు దీనిని కనుగొన్నారు. సుమారు 130 కి.మీ. ఎత్తున ఆకాశంలో ఎగిరే హెలిక్యాప్టర్ శబ్దాన్ని సైతం ఏనుగులు భూమిమీది నుంచే గుర్తు పడతాయని వారన్నారు. ఇన్‌ఫ్రాసానిక్ (Infrasonic), సీస్మిక్ (seismic) తరంగాలను గ్రహించే శక్తి వాటిలో గణనీయంగా ఉంటుందని వారు తెలిపారు. జీవ ప్రేరేపిత సూక్ష్మవిద్యుత్ యాంత్రిక వ్యవస్థల (bio inspired Microelectro mechanical systems: mems) ద్వారా ఏనుగులు వంటి జంతువుల్లోని ఈ ఇంద్రియజ్ఞానాల సాంకేతికతను శాస్త్రవేత్తలు సాధించగలుగుతున్నారు. కొన్ని రకాల జలశోధనా పరికరాల (water detector) ను శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. వీటిద్వారా భూగర్భంలో నీటి జాడలను కనిపెట్టాలన్నది వారి లక్ష్యం.

511
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles