పట్టు పట్టు.. లంగా ఓణీ కట్టు!


Fri,August 23, 2019 01:18 AM

ఈ శ్రావణమాసం వేళ.. పదహారణాల పడుచులా మెరిసేందుకు.. పట్టు పరికిణీకి మించిన బెస్ట్ ఆప్షన్ ఉంటుందా? నిశ్చితార్థ వేడుకలకు.. పెండ్లిలో మెహందీ ఫంక్షన్లకు.. పరికిణీలకే మా ఓటు అంటున్నారు.. బెనారస్.. కంచి.. ఇలా పట్టు ఏదైనా..
లంగా-ఓణీ కట్టి తీరాల్సిందేనంటున్నారు.. స్పెషల్‌గా డిజైన్ చేసిన పట్టు పరికిణీలే ఈ వారం ఫ్యాషన్‌లో..

Fashan
1. గ్రీన్ కలర్ కంచి పట్టు లంగా మీద ఫుల్‌గా గోల్డ్, సిల్వర్ జరీ బుటీస్ వచ్చాయి. దీనికి గోల్డెన్ జరీ బార్డర్ వచ్చింది. దీని మీద కుందన్స్, జర్దోసీతో వర్క్ చేయించాం. ఆకుపచ్చని రాసిల్క్ బ్లౌజ్ మీద కూడా ఫుల్‌గా జర్దోసీ, కుందన్ వర్క్‌తో నింపేశాం. ఆరెంజ్ కలర్ బెనారస్ దుపట్టా దీనికి పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. ప్లెయిన్ కాకుండా బుటీ వచ్చిన దుపట్టా కావడంతో లంగా-ఓణీ లుక్కే మారిపోయింది.

2. పింక్ కలర్ బెనారస్ లెహంగాను కలీస్‌తో కుట్టాం. దీని మీద ఫుల్‌గా జరీ బుటీస్ వచ్చాయి. గోల్డెన్ బార్డర్ సూపర్‌గా మెరిసిపోతున్నది. పింక్ కలర్ రాసిల్క్ మీద జర్దోసీ, సరోస్కీలతో హెవీగా వర్క్ చేయించాం. పర్పుల్ కలర్ బటర్ ైఫ్లె నెట్‌ని దుపట్టాగా
ఎంచుకున్నాం. దీనికి ఫుల్‌గా కట్ వర్క్ బార్డర్ ఇచ్చాం. ఈ వర్క్ మధ్యలో పింక్ థ్రెడ్‌తో చేసిన వర్క్ అదనపు ఆకర్షణ.

3. బుట్టబొమ్మలా మెరిసేందుకు ఈ పరికిణీ కట్టాల్సిందే! క్రీమ్ కలర్ ఫుల్ సిల్వర్ బుటీ జరీ వచ్చిన టిష్యూ కంచి పట్టు లంగా ఇది. దీనికి ఎర్రని త్రిబుల్ బార్డర్ మరింత వన్నె తెచ్చింది. ఎర్రని రాసిల్క్ బ్లౌజ్ మీద జర్దోసీ, జర్కన్స్‌తో హెవీగా వర్క్ చేయించాం. ఎర్రని క్రేప్ సిల్క్ దుపట్టాకి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. దీనికి కట్‌దానా వర్క్‌తో బార్డర్ ఇవ్వడంతో లుక్ మారిపోయింది.
Fashan1
4. పసుపు రంగు బెరాన్ లెహంగా ఇది. దీని మీద మొత్తం జరీ బుటీ వచ్చింది. కాంట్రాస్ట్ రంగు అయిన పింక్ బార్డర్ సూపర్‌గా కనిపిస్తున్నది. ఇదే మెటీరియల్‌ని బ్లౌజ్‌గా కూడా ఎంచుకున్నాం. కాకపోతే స్లీవ్స్‌కి చివర జర్దోసీతో వర్క్ చేయించాం. పింక్ కలర్ బెనారస్ దుపట్టా దీనికి పర్‌ఫెక్ట్ మ్యాచ్ అయింది. రాసిల్క్ మీద జర్దోసీ, కట్‌దానా వర్క్ చేసిన బెల్ట్ ఈ లంగా-ఓణీకి అదనపు ఆకర్షణ.

5. చిగురాకుపచ్చ లంగాకు.. పింక్ పెద్ద బార్డర్ వచ్చింది. కంచి పట్టు లంగాకి ఫుల్‌గా జరీ సూపర్‌గా కనిపిస్తున్నది. పింక్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ మీద జర్కన్, జర్దోసీ, సరోస్కీలతో ఫుల్‌గా స్లీవ్స్, నెక్‌లైన్, వెనుక వైపు వర్క్ చేశాం. మ్యాచింగ్‌గా ఉండాలని పింక్ కలర్ ఆర్గంజా చెక్స్ ప్యాటర్న్ ఉన్న దుపట్టాని ఎంచుకున్నాం. దీనికి కంచి బార్డర్‌ని జతచేయడంతో మెరిసిపోతున్నది.

వి. స్వాతి
స్వాతి వెల్దండి డిజైన్ స్టూడియో
బంజారాహిల్స్, హైదరాబాద్
8179668098

740
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles