రోజూ యోగా చేస్తున్నారా?


Mon,August 26, 2019 01:15 AM

మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రోజుకు అరగంట పాటు యోగా చేయడం వల్ల వీటన్నింటినీ తరిమికొట్టవచ్చు. యోగాతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
meditation
-యోగా ఎలా చేయాలంటే.. కూర్చుని కళ్ళుమూసుకొని, చెవులను చూపుడు వేళ్ళతో మూసుకొని గాలిని గట్టిగా లోపలికి పీల్చుకోవాలి. గాలిని బయటకు వదిలేటప్పుడు గొంతు నుంచి తుమ్మెద ఎగిరేటప్పుడు వచ్చే శబ్దం రావాలి. ఇలా రోజుకు ఐదుసార్లు చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
-యోగా అనేది క్రమశిక్షణను అమలు చేస్తుంది. మనస్సును నిగ్రహించుకుంటూ ఆధ్యాత్మిక భావనను నిద్రలేపే ప్రయత్నమిది.
-క్రమంగా యోగా చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది.
-భ్రమరి ఆసనం క్రమం తప్పకుండా చేస్తే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
-శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే కొన్ని కండరాలు మాత్రమే పనిచేస్తాయి. మరికొన్ని కండరాలు రక్తప్రసరణ జరుగక చచ్చుబడి పోవడమే కాకుండా శరీరంలో అనేక రోగాలు తిష్ట వేస్తాయి.
-కంప్యూటర్ దగ్గర పనిచేసేవారు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారందరూ ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు రాత్రి భోజనానికి ముందుగా మకరాసనం వేయడం మంచిది.

371
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles