సంపూర్ణ చర్మసంరక్షణ కావాలా?


Mon,August 26, 2019 01:22 AM

గతంలో పసుపు, చందనం, పాలతో స్నానం చేయించేవారు. వాటిని ఇప్పుడు పాత పద్ధతులంటున్నారు. కానీ అవే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌గా మారాయి. సంపూర్ణ చర్మసంరక్షణ కావాలంటే ఉపయోగించే ఉత్పత్తుల్లో ఇవి తప్పకుండా ఉండాలి.
skincare
-పసుపు : చర్మం మీది మచ్చలను తొలిగించి ముఖం ప్రకాశవంతంగా కన్పించేలా చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అన్నింటికీ మించి మొటిమల నివారణకు పసుపును మించిన ఔషధం లేదు.
-చందనం : క్రమం తప్పకుండా చందనం ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా చందనం బ్యాక్టీరియాను రాకుండా చేసి చర్మాన్ని ప్రకాశింపజేస్తుంది. ట్యాన్‌ను అరికడుతుంది. చర్మం పొడిబారకుండా, ముడుతలు కన్పించకుండా చేస్తుంది.
-కుంకుమ పువ్వు : దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, చర్మానికి కావాల్సిన విటమిన్లు ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా స్వచ్ఛంగా, మృదువుగా తయారవుతుంది.
-కలబంద : దీన్నే అలోవెరా అని కూడా అంటారు. ఇది చర్మంపై పొరలా ఉపయోగపడుతుంది. ఈ లేయర్ వల్ల చర్మంపై ఎప్పుడూ తేమ ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
-బాదం పాలు : ఎండ వేడికి చర్మం కమిలిపోతుంది. అంతేకాకుండా చేతులపై ట్యాన్ ఏర్పడుతుంది. రోజూ బాదం పాలు తాగితే సూర్యుడి నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు.

538
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles