అదృష్టం అంటే ఇదే!


Mon,August 26, 2019 01:23 AM

దేనికోసమైతే వెతుకుతున్నామో అదే దొరికితే? అదృష్టం తన్నుకొచ్చిందంటారు. ఊహించని అదృష్టం వచ్చినప్పుడు నక్కతోక తొక్కారని కూడా అంటుంటాం. అచ్చం అలాగే జరిగింది గ్రీస్ దేశానికి చెందిన ఓ మహిళకు.
women-1
అమందా హోలింగ్స్‌హెడ్‌ది గ్రీస్ దేశంలోని అర్కాన్సస్ నగరం. ఈమెకు బయటకు వెళ్లడం కానీ, పార్కుల్లో తిరగడం కానీ ఇష్టం ఉండదు. కానీ అర్కాన్సస్ నగరంలో ఓ పార్క్ ఉంది. అది వజ్రాల పార్క్. ఆ పార్క్‌లో ఎప్పుడూ కొందరు వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు. ఓ రోజు అమందా కూడా బంధువులు బలవంతం చేస్తే వారితో వెళ్లింది. పిల్లలను సరదాగా తీసుకెళ్దామనేది ఆమె ఉద్దేశం. అందరూ వజ్రాల కోసం వెతకడం ప్రారంభించారు. కానీ అమందా మాత్రం పిల్లల్ని పట్టుకొని పార్క్‌లో తిరుగుతున్నది. అప్పుడు తనకు కూడా వజ్రాలను వెతకాలని అనిపించింది. వజ్రాలను ఎల వెతకాలి అని యూట్యూబ్‌లో వీడియో చూడడం ప్రారంభించింది. పార్క్‌లోని ఓ బెంచీ మీద కూర్చొని ఈ వీడియో చూస్తున్న క్రమంలోనే ఆమె కాళ్ల దగ్గర రాళ్లలో ఏదో మెరిసినట్టు అనిపించింది. తీరా దాన్ని తీసుకొని పరిశీలిస్తే అది ఎల్లో డైమండ్. 3.72 కారెట్ల బరువుంది. ఇంకేముంది.. అమందా అదృష్టం అలా తిరిగింది. ఏడాది కాలంలో ఆ పార్క్‌లో దొరికిన అతిపెద్ద ఎల్లో డైమండ్ ఇదొక్కటే కావడం ఇక్కడ విశేషం. అయితే ఈ డైమండ్‌ని అమ్మాలా? లేదా తన దగ్గరే ఉంచుకోవాలా అని అమందా ఆలోచిస్తున్నదట.

576
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles