ఆ నర్సులు డెలివరీ అయ్యారు!


Mon,August 26, 2019 01:25 AM

గతేడాది ఒకే ఆస్పత్రికి చెందిన 9మంది నర్సులు గర్భవతులైన విషయం వైరల్ అయింది, గుర్తుందా? ఇప్పుడా నర్సులంతా ప్రసవించారు. 3 రోజుల నుంచి 3 నెలల వ్యవధి ఉన్న వారి పిల్లలు వారి తల్లుల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నది.
9-Nurses-Delivery-New
అమెరికా పోలాండ్‌లోని మైనే మెడికల్ సెంటర్‌లో పనిచేస్తున్న ఆ తొమ్మిది మంది నర్సులు ప్రసవించారు. గత మార్చి నెలలో తామంతా ఒకేసారి గర్భం దాల్చామంటూ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ప్రసవానంతరం బిడ్డలతో సహా దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా వారిలో ఒకరైన నర్సు ఎరిన్ గ్రెనియర్ మాట్లాడుతూ.. ఒకరి తర్వాత ఒకరం గర్భవతి అయినట్లు చెప్పుకోవడం చాలా కొత్తగా అనిపించింది. బేబీ బంప్ (కడుపు)తో ఒకరినొకరు చూసుకోవడం సంతోషమేసింది. మేం ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం ద్వారా ఏప్రిల్ నుంచి జూలై మధ్య నెలలో 9 మంది బిడ్డలకు జన్మనిచ్చాం అని తెలిపింది. తొమ్మిది మంది నర్సులు బిడ్డలకు జన్మనివ్వడంతో మైనే హాస్పిటల్ యాజమాన్యం మరో ఫొటోను పోస్టు చేసింది. ఇందులో 9 మంది నర్సులు తమ బిడ్డలను అందంగా ముస్తాబు చేసి, చిరునవ్వులు చిందించడాన్ని చూడవచ్చు. ఆ బిడ్డల వయస్సు 3 రోజులు నుంచి 3 నెలలు ఉంటుందని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది.

2036
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles