సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే?


Tue,August 27, 2019 01:24 AM

కాలేయానికి దీర్ఘకాలిక వ్యాధులు సోకిన తరువాత కాలేయ కణాలు పనిచేయకపోవడం వల్ల కాలేయంలో కొన్ని పరిణామాలు జరుగుతాయి. దీనివల్ల వచ్చే సమస్యను సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు.
Cirrhosis-Liver
దీర్ఘకాలిక కాలేయ సమస్యలు ఉన్నవారిలో, హెపటైటిస్ ఉన్నవారిలో, పైత్యరస ప్రసరణలో అడ్డంకులు వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది సోకుతుంది. ఈ సమస్య వల్ల కడుపులో నీరు చేరుతుంది. కాళ్లు చేతుల్లో వాపు వస్తుంది. వాంతిలో రక్తం పడుతుంది. పచ్చ కామెర్లు వస్తాయి. రక్త నాళాలు ఉబ్బుతాయి. ఆలోచనలలో తికమక వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపరీక్ష, లివర్ ఎంజైమ్‌ల తీరు కనుగొనుట, రక్తంలో బిలిరుబిన్ స్థాయి కనుగొనుట, ఎక్స్‌రే, సూది సహాయంతో లివర్ కణాలు తీసి పరీక్ష చేసి వ్యాధి నిర్ధారిస్తారు.

77
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles