రేచీకటి ఎందుకొస్తుంది?


Tue,August 27, 2019 01:26 AM

రాత్రిళ్లు కంటిచూపు మందగించడాన్ని రేచీకటి అంటారు. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పోషకాహారం లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి పిల్లలకు మంచి పోషక విలువలున్న ఆహారం ఇస్తేనే సంపూర్ణ కంటిచూపు అందించినవాళ్లం అవుతాం.
Night-Blind
ఆహారంలో విటమిన్-ఎ సరిగా లేకపోవడం వల్ల రేచీకటి వస్తుంది. రెటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. ఈ సమస్య వచ్చినవారిలో రాత్రిపూట కళ్లు అసలు కనిపించవు. విటమిన్-ఎ లోపం తీవ్రంగా ఉంటే కార్నియా కరిగిపోయి కెరటోమలేసియా సమస్య వస్తుంది. పిల్లలను రేచీకటి నుంచి తప్పించాలంటే మాత్రం కచ్చితంగా విటమిన్-ఎ ఉన్న ఆహారం పెట్టాల్సిందే. అవసరం అనుకుంటే డాక్టర్ సలహాతో విటమిన్ మాత్రలు కూడా వేయాలి. సమస్య తీవ్రం అయితే కొన్ని సందర్భాల్లో పూర్తి అంధత్వం కూడా వచ్చే ప్రమాదం ఉంది.

67
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles