రారండోయ్‌.. ఫామ్‌ ప్లాట్లను చూద్దాం


Sat,August 31, 2019 12:38 AM

farmhouse
సొంతంగా ఓ ఫామ్‌ హౌజ్‌ కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. కాకపోతే, నిర్వహణ కష్టమని వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారందరిని దృష్టిలో పెట్టుకుని, జనప్రియ ఇంజినీర్స్‌ కొత్తగా ‘అర్బన్‌ ఫామ్స్‌'కు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌లో అందుబాటు గృహాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన జనప్రియ ఇంజినీర్స్‌.. తాజాగా ఫామ్‌ కమ్యూనిటీని ప్రారంభించింది. సుమారు 36 ఎకరాల కమ్యూనిటీలో నాలుగు రకాల ప్లాట్లను విక్రయిస్తున్నది. ఒక్కో ప్లాటు అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో డిజైన్‌ చేశారు. కుటుంబంతో కలిసి వారాంతాల్లో సరదాగా గడపాలన్నా.. ఇంటి సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడపాలని భావించేవారికిది చక్కగా నప్పుతుందని జనప్రియ సంస్థ చెబుతోంది. పరిగి- మన్నెగూడ రోడ్డులో ఫామ్‌ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. టీఎస్‌పీఏ జంక్షన్‌ నుంచి అరవై నిమిషాలు ప్రయాణిస్తే చాలు.. అర్బన్‌ ఫామ్స్‌కు చేరుకోవచ్చు. ఇందులో ప్లాటు కొనుక్కునేవారికి రెండేండ్ల పాటు నిర్వహణ కూడా ఉచితంగానే చేస్తామని సంస్థ చెబుతున్నది. ఒక్కో ప్లాటు ధర రూ.45 లక్షల నుంచి ఆరంభమవుతున్నదని జనప్రియ అంటున్నది. పైగా, అర్బన్‌ ఫామ్‌ కమ్యూనిటీలో గెస్ట్‌ హౌజుతో పాటు స్విమ్మింగ్‌ పూల్‌, పార్టీ డెక్‌, అతి పెద్ద లాన్లు వంటివి సంస్థ అభివృద్ధి చేసింది.

l జనప్రియ అర్బన్‌ ఫామ్స్‌కు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులోని గెస్ట్‌ హౌసును బుక్‌ చేసుకోవచ్చు. పైగా, ఫామ్‌ స్థలం ఉండటం వల్ల కలిగే ప్రయోజనం గురించి అందరికీ తెలిసిందే. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మీద ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. కొంతకాలం తర్వాత ప్లాటును విక్రయించినా, క్యాపిటల్‌ గెయిన్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ఫామ్‌ ప్లాటు కొన్న ఎనిమిది నెలల తర్వాత అందులో సదుపాయాల్ని అభివృద్ధి చేసిస్తామని జనప్రియ చెబుతున్నది. ఇందులో ప్లాటు కొన్నవారు ఎంచక్కా మామిడి పండ్లను ఆస్వాదించొచ్చు. ఇందులో పార్టీ డెక్‌తో 20 మీటర్ల స్విమ్మింగ్‌ పూల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పైగా, బీచ్‌ వాలీబాల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

134
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles