ప్రభుత్వ అధికారులపై చర్యలు?


Sat,August 31, 2019 12:43 AM

నిబంధనల్ని పాటించని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఓ రెరా అథారిటీ ఛైర్మన్‌ అభిప్రాయపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇండ్ల కొనుగోలుదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. ఎక్స్‌టర్నల్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలను వినియోగించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2003లో రెరా ఆరంభమైనప్పట్నుంచి నేటివరకూ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎవరూ ప్రకటించలేదు.

ప్రస్తుతం రెరా చట్టంలో కొన్ని లొసుగులున్నాయి.. అందుకే మొత్తం నిర్మాణ రంగాన్ని సంస్కరించాల్సిందే. బ్యాంకులు, బీమా సంస్థలు వంటి వాటిని రెరా పరిధిలోకి తేవాల్సిందే. నిధుల మళ్లింపు, అసలైన లేఅవుటును మార్చివేయడం, ఆలస్యంగా ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగించడం వంటి మూడు సమస్యలు నెలకొన్నాయి. మొదటి సమస్యకు పరిష్కారం లభించగా.. మిగతా ఇబ్బందులు అతిత్వరలో పరిష్కరించే వీలున్నది. ఫ్లాట్ల అప్పగింత ఆలస్యమైతే ప్రమోటర్లపై జరిమానా విధించాల్సిందే. అయితే, ప్రమోటర్‌, కొనుగోలుదారుల మధ్య ఒప్పందం కుదిరిన నాటి నుంచి జరిమానాను లెక్కించాల్సి ఉంటుంది.

102
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles