విద్యుత్ రైస్ కుక్కర్ వాడుతున్నారా?


Sat,August 31, 2019 12:51 AM

ఇటీవల ఎక్కువమంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లోనే అన్నం వండుతున్నారు. ఒకప్పుడు పట్టణంలో ఉన్న ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. అయితే ఎలక్ట్రికల్ రైస్‌కుక్కర్‌లో వండిన ఆహారం తింటే అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.
Rice-Cooker
-వంటల్లో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
-ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్య నిపుణులు చెడుతున్నారు.
-నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది.
-రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది.
-మట్టిపాత్రలు, లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించుకుని తీసుకోవడం మేలు. మట్టిపాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి. ప్రెజర్ కుక్కర్‌లో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయి.

1076
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles