అనుకూలంగా.. రెరా


Sat,September 7, 2019 01:26 AM

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం (రెరా)లోని అనేక నిబంధనలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. రెరాలో నిబంధనల సవరణ జరిగితే డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరే అవకాశమున్నది. గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖకు వచ్చిన అనేక ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రెరా చట్టానికి అవసరమైన సవరణలు చేస్తోందని సమాచారం. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నిర్వహించిన అనేక వర్క్‌షాపుల్లో చాలా విలువైన అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చాయి. వాటి ఆధారంగా రెరా చట్టంలో చాలా మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తున్నది. త్వరలోనే రెరా చట్టంలో పలు సవరణలు చేస్తారని సమాచారం. రెరా చట్టాన్ని మరింత ప్రభావవంతంగా చేయడం కోసమే ఈ సవరణలు చేస్తున్నట్టు కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అంటున్నది. రియల్ ఎస్టేట్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు రూపొందించిన విధాన కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వానికి నరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) పూర్తి సహకారం అందిస్తున్నదని తెలిసింది.

81
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles