ఈ జ్వరం ఎలా తగ్గేది?


Sat,September 7, 2019 01:33 AM

నా వయసు 31 సంవత్సరాలు. నెల రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతున్నది. తిరిగి 6 గంటల్లో రాత్రి కాగానే మళ్లీ జ్వరం వస్తున్నది. డాక్టర్ అన్ని బ్లడ్ రిపోర్టులు చేయించారు. అన్నీ బాగానే ఉన్నాయన్నారు. నా పరిస్థితి అర్థం కాకుండా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నా సమస్యకు పరిష్కారం చూపండి.
- సుధీర్, మహబూబ్ నగర్

fever-sick
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు అధికంగా ఉన్నాయి. వ్యక్తి రోగ నిరోధక శక్తినిబట్టి ఆయా పేషెంట్లలో లక్షణాలు ఉంటాయి. అన్ని రక్త పరీక్షలు చేయించాము అంటున్నారు. కాని అవి ఏంటో వాటి వివరాలు తెలియజేయలేదు. ముఖ్యంగా మనం డెంగ్యూ పరీక్ష కూడా చేయించాలి. తరువాత ఒకవేళ అది పాజిటివ్ వస్తే జ్వరం వచ్చిన నాలుగవ రోజు నుంచి ప్లేట్‌లెట్‌ల సంఖ్య పడిపోతుంది. దాంతో నీరసం, శరీరం పైన దద్దుర్లు రావడం వంటి లక్షణాలుంటాయి. కొంతమందికి ఆయాసం, కడుపు నొప్పి, వాంతులు కూడా కనిపిస్తాయి. దాన్ని పాలీ సీరసైటిస్ అంటాం. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లలో చికున్ గున్యా టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. మీ జ్వరం, వాడే మందులు పూర్తిగా తెలియజేయలేదు. మీరు దగ్గర్లో ఉన్న ఫిజీషియన్‌ని కలవండి.

డాక్టర్, కె. ప్రశాంత్ కుమార్
జనరల్ ఫిజీషియన్, సన్‌షైన్ హాస్పిటల్, సికింద్రాబాద్

206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles