పుదీనాతో రెట్టింపయ్యే అందం


Sat,September 7, 2019 01:35 AM

pudeena-beauty
-పుదీనా నూనెను వాడడం వల్ల మెరుగైన చర్మం పొందవచ్చు. చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలగించి, చర్మం ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే కొన్ని చుక్కల పుదీనా నూనెను నేరుగా చర్మానికి వాడి తర్వాత మార్పులను గమనించవచ్చు.
-జుట్టు పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. మీ జుట్టు కోసం రోజూ వాడే నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనె కూడా వెంట్రుకలకు ఐప్లె చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదల బాగుంటుంది.
-పొడి జుట్టు ఉన్నవారికి పుదీనా నూనె సహాయపడుతుంది. దీనికోసం రోజూ వాడే కొబ్బరినూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనెను కలిపి జుట్టుకి ఐప్లె చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలకు కావాల్సిన తేమ అందుతుంది. జుట్టు పొడిబారడం తగ్గుతుంది.
-జిడ్డు చర్మం ఉన్నవారికి పుదీనా మంచి క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్‌కు కొద్దిగా పుదీనా నూనెను కలిపి చర్మాన్ని ఐప్లె చేయాలి. ఈ మిశ్రమం చర్మం పీహెచ్ స్థాయిలను పెంచి, చర్మంలో ఉత్పత్తి అయ్యే అధిక నూనెలను తగ్గిస్తుంది.

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles