పదే పదే వానలో తడుస్తున్నారా!


Sat,September 7, 2019 01:36 AM

Rainn
-వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షపు నీరుతో పాటు మురుగు నీరు తాగునీటిలో కలిసి సరఫరా కావొచ్చు. అందుకని నీటిని కాచి వడపోసి తాగడం మేలు. లేదంటే ప్యూరిఫైడ్ నీటిని తాగితే ఇంకా మంచిది. నీటి ద్వారా జలుబు, గొంతునొప్పి, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వస్తాయి.
-వర్షంలో ఒక్కసారి తడిసినా చాలు చాలామంది జలుబు బారిన పడుతుంటారు. గొంతునొప్పి, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. సైనస్ వస్తే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో వర్షంలో తడవకుండా జాగ్రత్తపడాలి.
-ఒకవేళ వానలో తడిస్తే వెంటనే తల, ఒళ్లు తుడుచుకొని పొడి దుస్తులు వేసుకోవాలి. వేడిపాలల్లో పసుపు వేసుకుని తాగడం, నువ్వులు, బెల్లం లాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వేడినీటిలో ఉప్పు వేసి పుకిలించడం, ముఖానికి నీటి ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం ఉంటుంది.
-వర్షాకాలంలోనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వీటికి ప్రధానకారణం దోమకాటు. మలేరియా, డెంగ్యూ ఫైలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు దోమకాటుతో వస్తాయి. దీని కోసం ఇంటి పరిసరాల్లో దోమలు ఆవాసం ఏర్పరుచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

203
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles