కురియో.. పర్యావరణ హితం


Sat,September 7, 2019 01:37 AM

పాడైపోయిన టైరు నుంచీ ఓ కొత్త రకం షూ, చెప్పులు తయారుచేయొచ్చని తెలుసా? ప్రస్తుతం రాజస్థాన్, ముంబై వాసుల మనసు దోచుకుంటున్నాయి ఈ తరహా ఫుట్‌వేర్, ఫ్యాషన్ వస్తువులు.
Megha-Kurio
ఏదైనా ఒక వస్తువును ఉపయోగించిన తర్వాత, దాని కాలపరిమితి దాటిపోతే పడేస్తుంటాం. దానిని తిరిగి వాడే విధానంపై ఆలోచించం కూడా. అలా చేయకపోవడం వల్ల రోజు రోజుకూ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రాజస్థాన్‌కు చెందిన మేఘారావత్ తన వంతు కృషి చేస్తున్నది. వాడి పడేసిన వస్తువులు, ఇంట్లో వృథాగా ఉన్న నాణ్యమైన బట్టలతో ఓ కొత్త ఆలోచన చేసింది. చేనేత వస్ర్తాలతో పౌచ్‌లు, బ్యాగ్‌లు వంటివి తయారు చేయిస్తున్నది. అంతేకాకుండా చేనేత, శిల్ప కళాకారులను ఏకం చేసి కొత్తగా షూ, చెప్పులను తయారు చేయిస్తున్నది. అది కూడా వృథాగా ఉండే టైర్లతో. వాడిపడేసిన టైర్లను సేకరించి వాటిని శుభ్రం చేయించి, స్థానిక కళాకారులతో నాణ్యమైన, ఎక్కువకాలం మన్నికగల ఫుట్‌వేర్ చేయించింది. వాటిని కురియో పేరుతో రాజస్థాన్ మార్కెట్‌లో పరిచయం చేసింది. ఈ విషయం తెలిసిన పీహెచ్‌డీ స్కాలర్ కస్తూరి రతన్.. ముంబైలోని లిల్ ఫ్లియాలో మేఘారావత్‌తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించింది. దీంతో ముంబై, రాజస్థాన్‌లో ఈ కొత్త తరహా ఫుట్‌వేర్, ఫ్యాషన్ వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో స్వయం సహాయ బృందాలకు ఉపాధి కల్పిసూ.. వారితోనే ఫుట్‌వేర్, ఫ్యాషన్ వస్తువులు తయారు చేయిస్తున్నారు మేఘా, కస్తూరి. ఈ విధంగా నేతన్నలు, శిల్ప కళాకారులు, స్వయం సహాయక బృందాలకు ఉపాధి కల్పిస్తూనే, పర్యావరణహితమైన ఆలోచన చేసింది 28 యేండ్ల మేఘా రావత్. ఈ ఫుట్‌వేర్‌ను త్వరలోనే దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేఘా, కస్తూరీ ద్వయం.

190
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles