వాట్సాప్ థీమ్ మార్చుకోవచ్చు


Wed,September 11, 2019 12:58 AM

రోజురోజుకూ కొత్త అప్‌డేట్స్‌తో యూజర్లను మరింత మెప్పిస్తున్నది వాట్సాప్. తాజాగా మరో సరికొత్త అప్‌డేట్ ఇవ్వనుంది. గ్రీన్ కలర్‌లో ఎప్పుడూ కనిపించే వాట్సాప్ కలర్‌ను ఈ ఫీచర్‌తో మార్చుకోవచ్చు.
yoWhatsApp
ఇన్నాళ్లు వాట్సాప్‌లో వాల్‌పేపర్ మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. దానికి బదులు ఇప్పుడు థీమ్ కూడా మార్చుకోవచ్చు. వాల్ పేపర్ మార్చుకుంటే చాటింగ్ డిస్‌ప్లే స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. దీని కోసం ఫొటో అయినా కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు థీమ్ చేంజ్ వస్తే థీమ్‌ను బట్టి ఐకాన్‌లలోనూ మార్పును గమనించవచ్చు. అంతేకాదు, దీంతోపాటు వాట్సాప్ స్టిక్కర్లను యాప్‌లోనే ఉండేలా.. అంటే ఈమోజీలలాగే వాడుకునేందుకు వీలుంది. ఇప్పటికే టెస్ట్ వెర్షన్‌లా గ్రీన్ కలర్ థీమ్‌ను విడుదల చేసింది వాట్సాప్. స్పందనను బట్టి ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ అందించేందుకు కృషి చేస్తున్నది. సోషల్‌మీడియాకు అనుగుణంగా అప్‌డేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా థీమ్స్ మార్చుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.

360
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles