బహుమతుల పొదరిల్లు హ్యాపీనెస్ ట్రంక్


Wed,September 11, 2019 01:09 AM

Gifts
బహుమతి.. అంటే ఓ మధుర జ్ఞాపకం. ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అందుకే పెండ్లి, సీమంతం, ఉయ్యాల ఫంక్షన్, పుట్టినరోజు.. ఇలా ఫంక్షన్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కామన్ అయిపోయింది. రిటర్న్ గిఫ్టులు కూడా ఇప్పుటి ట్రెండ్. అయితే చాలామంది గిఫ్ట్‌కు ఇచ్చిన ప్రాధాన్యం దాని ప్యాకింగ్‌కు ఇవ్వరు. ఎంతమంచి బహుమతైనా ఓ మామూలు రంగు కాగితంతో ప్యాక్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకూ అంత స్పెషల్‌గా గిఫ్ట్ ప్యాక్ చేసిచ్చేవారు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యకు హ్యాపీనెస్ ట్రంక్ చక్కటి పరిష్కారం చూపిస్తున్నది. బహుమతి ఇచ్చినవారి గౌరవాన్ని పెంచి, ప్లాస్టిక్ రహిత గిఫ్ట్ ప్యాకింగ్‌ను పరిచయం చేస్తున్నది హ్యాపీనెస్ ట్రంక్.
Gifts2
Gifts3
మర్యాద పూర్వకంగా కలువడం నుంచి.. శుభకార్యాలు, వేడుకలు, అభినందనలు, సన్మానాలు, పదవీ విరమణ వరకూ ప్రతీ కార్యక్రమంలోనూ బహుమతులే ప్రత్యేకం. మరికొన్ని ప్రత్యేక దినాలల్లో స్పెషల్ గిఫ్ట్‌లదే హవా. ఇక ప్రియమైన వారికి ఇచ్చే సర్‌ప్రైజింగ్ బహుమతులతో వచ్చే కిక్కేవేరు. ఖరీదైన బహుమతులే ఇచ్చినా.. దానిపై ప్యాకింగ్ మాత్రం అంత ఆకర్షణీయంగా, ఇచ్చేవారి గౌరవాన్ని చూపే విధంగా ఉండదు. ఈ నేపథ్యంలో హ్యాపీనెస్ ట్రంక్‌తో మన ముందుకొచ్చారు శ్వేతా తుల్లా, అనిమిషా రావూరి. వేడుక ఏదైనా.. గిఫ్ట్ ఎలాంటిదైనా అబ్బురపరిచే డిజైన్లతో అందరినీ ఆకట్టుకునే విధంగా ప్యాకింగ్ చేయడం వీరి ప్రత్యేకత. ఫంక్షన్‌లో గిఫ్ట్ ఏమిచ్చారు? అని ఆలోచించేవాళ్లకంటే ప్యాకింగ్ చూసి అంచనా వేసేవాళ్లు చాలామంది ఉంటారంటారు. అందుకే గిఫ్ట్ ప్యాకింగ్‌కు కూడా ఓ స్థాయిని ఇవ్వాలన్నదే శ్వేతా, అనిమిషా ప్రయత్నం.
Gifts4

ఏం చేస్తారంటే?

హ్యాపీనెస్ ట్రంక్ అనేది ఒక బహుమతుల పొదరిల్లు. వీరి వద్దకు ఎవరైనా గిఫ్ట్ కోసం వస్తే.. ఫంక్షన్ ఎలాంటిది? దానికి వారి వద్ద ఏదైనా థీమ్ ఉందా? అని అడుగుతారు. కస్టమర్ ఏదైనా డిజైన్‌తో వస్తే దాన్నే ఫాలో అవుతారు. లేదంటే అకేషన్‌కు తగినట్లుగా వీరి వద్ద ఉన్న డిజైన్లు చూపిస్తారు. ఆర్డర్ ఓకే అయిన వెంటనే పని మొదలెడుతారు. అవుట్‌పుట్ ఎలా వస్తుందో కస్టమర్లకు చూపించి మార్పులు చేయాలనుకుంటే వాటిని మారుస్తారు. కస్టమర్ తుది నిర్ణయం తెలుసుకున్న తర్వాతే పని పూర్తి చేస్తారు. వారికి నచ్చినట్లే డిజైన్ చేస్తారు కాబట్టి బహుశా హ్యాపీనెస్ ట్రంక్‌కు నెగెటివ్ రివ్యూస్ ఉండవు. ఇక గిఫ్ట్ ప్యాకింగ్‌లు కూడా చాలా ఆధునికంగా, సంప్రదాయబద్ధంగానూ ఉంటాయి. ఈ విధానం చాలా మందిని ఆకర్షిస్తున్నదని అంటున్నారు శ్వేత, అనిమిషా.
Gifts5

పర్యావరణహిత ంగా..

హ్యాపీనెస్ ట్రంక్ గిఫ్ట్‌లన్నీ పర్యావరణహితమైనవే. ఎక్కడా ప్లాస్టిక్ ఉపయోగించరు. ఇందుకోసం కార్డ్‌బోర్డ్, ఫ్యాబ్రిక్, మెటల్, సిరామిక్, గ్లాస్ వంటి మెటీరియల్‌ను ఎంచుకుంటారు. ఈ మెటీరియల్ ముంబై, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఎక్కడ అందుబాటులో ఉంటే.. అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. ఒకసారి చేసిన గిఫ్ట్ ప్యాకింగ్ డిజైన్‌ను మరోసారి చేయకపోవడం వీరి ప్రత్యేకత. అందుకు కావాల్సిన మెటీరియల్, ట్రావెలింగ్ అంతా అనిమిషా చూసుకుంటుంది. ఆర్డర్లు, వినియోగదారులతో మాట్లాడడం శ్వేతా చూసుకుంటుంది. హ్యాపీనెస్ ట్రంక్ ద్వారా అకౌంట్స్, ప్యాకింగ్, డెలివరీ వంటి విభాగాల్లో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. డిజైనర్ కస్టమర్ అభిరుచికి తగ్గట్లు డిజైన్ చేస్తే, వాటికి ఎలాంటి రంగులు నప్పుతాయో శ్వేత, అనిమిషా నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లోనే కాకుండా విజయవాడ, నెల్లూరు, వైజాగ్ వంటి ప్రాంతాలకు కూడా కొరియర్ చేస్తారు. ఆయా డిజైన్లను బట్టి వీటి ధర రూ.300 నుంచి ప్రారంభమవుతుంది. మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకూ అందరికీ ధరలు అందుబాటులో ఉన్నాయి.
Gifts6

గిఫ్ట్ ప్యాకింగ్‌పై అధ్యయనం..

చిన్నప్పటి నుంచే గిఫ్ట్ ప్యాకింగ్‌పై ఇష్టం పెంచుకున్నారు శ్వేతా, అనిమిషా. శ్వేత కుటుంబ సభ్యులు కూడా సరదాగా గిఫ్ట్ ప్యాకింగ్ చేసేవాళ్లు. అనిమిషాకు కూడా క్రాఫ్ట్స్‌పై ఆసక్తి ఎక్కువ. ఆ అభిరుచే గోపాల్ అనే కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరినీ కలిపింది. వీరిద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో ప్రత్యేకించి గిఫ్ట్ ప్యాకింగ్‌పై దృష్టి సారించారు. వెంటనే స్టోర్ ప్రారంభించకుండా ప్రజలు ఎలా ఆదరిస్తారో తెలుసుకునేందుకు అధ్యయనం మొదలు పెట్టారు. 2017లో బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో యాత్ర పేరుతో ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో రకరకాల గిఫ్ట్ ప్యాకింగ్‌లు తయారు చేసి పెట్టారు. దానికి ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది. మొత్తానికి వీరు ఎంచుకున్న పని కొత్తగా ఉండడంతో 2017లోనే ఫిల్మ్‌నగర్‌లో హ్యాపీనెస్ ట్రంక్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో వేడుకలు, శుభకార్యాలకు వీరు బహుమతులు అందించారు. 15 పెండ్లిళ్లు, 40 సీమంతాలు, 25కు పైగా ఎంగేజ్‌మెంట్స్, రిసెప్షన్స్ ఇలా మొత్తం 150కు పైగా ఆర్డర్లు చేశారు. ఒక్కో ఆర్డర్‌కు పదుల నుంచి వందల్లో గిఫ్టులు అందించారు. ఒక్కోసారి 5 వేల వరకు గిఫ్ట్ ప్యాకింగ్ చేసిన రోజులున్నాయని అంటున్నారు శ్వేత, అనిమిషా. వీరికి టీవీ షోల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. రానా షో నెం.1 యారి, మేము సైతం షోలకు గిఫ్ట్ హ్యాంపర్లు హ్యాపీనెస్ ట్రంక్ నుంచి అందిస్తుంటారు. నమ్రతా శిరోద్కర్, మంచు లక్ష్మి, స్వప్నదత్, అల్లరినరేశ్ భార్య నిరూప హ్యాపీనెస్ ట్రంక్ వద్దే బహుమతులు కొనుగోలు చేస్తుంటారు.
Gifts7

ప్రతిరోజూ కొత్తగా..

నేను పుట్టి, పెరిగింది ముంబైలోనైనా ఇక్కడే సెటిల్ అయ్యాం. మా వారు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు నేను ఎయిర్‌టెల్‌లో ఉద్యోగం చేశా. చిన్నప్పటి నుంచి క్రియేటివ్‌గా ఆలోచించడం ఇష్టం. ప్రతిరోజూ కొత్తగా ఉండాలనుకునేదాన్ని. ఇందుకు క్రాఫ్ట్స్‌లో గిఫ్ట్‌ప్యాకింగ్ ఎంచుకున్నా. హ్యాపీనెస్ ట్రంక్‌తో నాకు ప్రతిరోజూ స్పెషలే. బ్యాచులర్ పార్టీ టీ షర్ట్స్, కిడ్స్ టీషర్ట్స్, ట్రెసర్ ప్యాకింగ్, పెండ్లికూతురు, పెండ్లికొడుకుకు కావాల్సిన వస్తువులన్నింటినీ విడివిడిగా వారి పేర్లతో ప్యాకింగ్ చేస్తాం. వీటితోపాటు పిల్లల టీ షర్ట్స్ www.happiness trunkkids.com వెబ్‌సైట్లో దొరుకుతాయి.
- అనిమిషా రావూరి
Gifts8

బాగా ఆదరిస్తున్నారు..

నేను హైదరాబాదీనే. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాను. మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ గారికి పెద్ద కోడలిని. నేను దేవేందర్ విద్యాలయం స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్. మంగళవారం, గురువారం స్కూల్ చూసుకుంటాను. శనివారం, ఆదివారం ఇంటికే పరిమితం. మిగిలిన రోజులు స్టోర్ చూసుకుంటా. స్టోర్ విషయాలు నేను అనిమిషా ఎప్పటికప్పుడూ చర్చించుకుంటాం. మనవాళ్లు హ్యాపీనెస్ ట్రంక్‌ను బాగా ఆదరిస్తున్నారు. వచ్చే ఆరునెలల్లో వైజాగ్, విజయవాడలో హ్యాపీనెస్ ట్రంక్ బ్రాంచ్‌లు పెట్టాలనుకుంటున్నాం. అక్కడ కూడా మా థీమ్, కాకపోతే ఆసక్తి ఉన్న మహిళలతో నడిపిస్తాం. పూర్తి వివరాల కోసం https://www. facebook.com/happi nesstrunkindia/ సంప్రదించండి.
- శ్వేతా తుల్లా

- వనజ వనిపెంట చిన యాదగిరి గౌడ్

297
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles