వేకువవేళ నిద్ర లేస్తే ఎన్ని లాభాలో..


Mon,September 16, 2019 12:30 AM

వేకువ జామున నిద్రలేవాలంటే కొంతమందికి బద్ధకం. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కొన్ని రకాల మందులు దీర్ఘకాలిక నొప్పులు, వంటి వాటి వల్ల వేకువజామున నిద్రలేవడానికి ఇబ్బంది పడుతారు. ఉదయాన్నే నిద్ర లేస్తే ఎన్నో లాభాలున్నాయి.
early-morning-wakeup
-వేకువజామునే నిద్రలేవడం వల్ల సహజంగానే ఉదయం అల్పాహారం తీసుకోవడం అలవాటవుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లు తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటికివస్తాయి. నిద్ర లేచిన తర్వాత రెండు లేదా మూడు గంటల్లోపు తప్పనిసరిగా టిఫిన్ చేయాలి.
-చాలామంది ఆలస్యంగా నిద్రలేవడం వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేద ని చెబుతుంటారు. వేకువజామునే నిద్రలేవడం వల్ల ఎక్కువ సమయం వ్యాయామానికి, వ్యక్తిగత పనులకు వినియోగించుకోవచ్చు.
-వేకువజామునే నిద్రలేవడం వల్ల ఎలాం టి అవాంతరాలు లేకుండా ముఖ్యమైన పనులపై ఏకాగ్రత చూపుతారు. దాంతో పాటు మెదడు ఉదయం అత్యంత చురు గ్గా పనిచేస్తుంది. కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంటుంది.
-వేకువజామున చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండడం వల్ల మెడిటేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు మరింత చురుగ్గా పనిచేస్తుంది. పగటి పూట నిద్ర రాకుండా ఉం టుంది. మైండ్‌తో పాటు బాడీని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది.

688
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles