ఇది డెంగ్యూయేనా?


Mon,September 16, 2019 12:32 AM

నా వయసు 24 సంవత్సరాలు. ఈమధ్య కాలంలో నేను మా ఊరు వెళ్లి వచ్చాను. తరువాతి రోజు నుండి జ్వరం మొదలైంది. జ్వరం తగ్గుతూ పెరుగుతున్నది. ఎవరిని చూసినా డెంగ్యూ జ్వరం వచ్చినవాళ్లు ఉంటున్నారు. నాకు కూడా డెంగ్యూ జ్వరమేనేమో అని భయంగా ఉంది. దీన్ని ఎట్లా నిర్ధారణ చేయాలి? ఏ చికిత్స ఉంది?
- వీరేశ్, నల్గొండ

Dengue
మీరు తెలిపిన వివరాలనుబట్టి చూస్తే మీకు వైరల్ ఫీవర్ అనేది తెలుస్తోంది. అయితే డెంగ్యూ అవునో కాదో తెలుసుకోవడానికి పరీక్షలు అవసరమవుతాయి. డెంగ్యూ ఎన్‌ఎస్1, డెంగ్యూ సీరాలజీ, డెంగ్యూ ఐజిజి, ఐజిఎం పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ఫలితాలు రావడానికి 4 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. పైగా కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. అందుకే ముందుగా లక్షణాలను బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. బ్లడ్ ప్లేట్‌లెట్ కౌంట్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ అవి తగ్గిపోకుండా చూసుకోవాలి. మొదట అది రాకుండా నివారించుకోవడమే ఉత్తమమైన పద్ధతి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు ఎక్కువగా రాకుండా జాగ్రత్తపడడం మంచిది. ముందు మీరు దగ్గరలో ఉన్న ఫిజీషియన్‌ను కలవండి. పరీక్షలు చేయించుకోండి. వాటి రిజల్ట్స్ వచ్చేలోపు సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్ తీసుకోండి.డాక్టర్ చేతన్
కన్సల్టెంట్
జనరల్ మెడిసిన్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

325
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles