పరిశుభ్రత మన చేతుల్లోనే!


Tue,September 17, 2019 12:42 AM

handwash
ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా హ్యాండ్‌ వాష్‌ వాడుతున్నారు. పరిశుభ్రతపై శ్రద్ధపెరగడమే కారణం. కానీ ఇప్పటికీ కొందరు కేవలం నీటితో మాత్రమే చేతుల్ని కడుక్కుంటారు. అలా కడుక్కున్నప్పుడు చేతుల్లోని సూక్ష్మ క్రిములు చేతులపైనుంచి పోవు. హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌ లేనప్పుడు ఈ చిన్న చిట్కాల ద్వారా చేతులను శుభ్రం చేసుకోవచ్చు.


- చేతులను ఎంత శుభ్రం చేసుకున్నా కొన్నిసార్లు కంటికి కనబడని సూక్ష్మ క్రిములు ఓ పట్టాన వదలవు. అలాగే భోజనం చేస్తే అనారోగ్యం వస్తుంది. నీటిలో కాస్త ఉప్పువేసి రెండు చేతులను బాగా రాసి కడుక్కోవచ్చు.
- గ్లాసుడు నీటిని వేడి చేయాలి. అందులో లవంగాలు వేసి కొద్దిసేపు మరిగించాలి. గోరువెచ్చ అయ్యాక ఆ నీటితో చేతులను శుభ్రపర్చుకుంటే ఎంతో మంచిది. లవంగాలలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు మీ చేతులను శుభ్రపరుస్తాయి.
- వాడిన తర్వాత నిమ్మచెక్కల్ని పడేయకుండా హ్యాండ్‌ వాష్‌కు ఉపయోగించవచ్చు. నిమ్మచెక్కలతో చేతులపై బాగా రుద్దడం వల్ల కూడా చేతులు శుభ్రపడుతాయి.
- కాస్త చింతపండును నీళ్లలో నానబెట్టి ఆ రసంతో చేతులను రుద్దుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కుంటే పూర్తిగా శుభ్రమవుతాయి.

485
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles